
కేసముద్రం ఎస్సై కోగిల తిరుపతి
కేసముద్రం (మహబూబాబాద్) నేటి ధాత్రి:
కేసముద్రం మండల కేంద్రంలోని పలు గ్రామాలలో ఉన్నటువంటి డిజే యజమానులను కేసముద్రం తహసిల్దార్ చందా నరేష్ ముందు హాజరు పరిచారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలలో డీజే కు అనుమతి లేదని అన్నారు.డీజే నిర్వహించడం వల్ల ప్రజలు అసౌకర్యానికి గురయ్యి పలు సమస్యలు వస్తాయని,అలాగే చెదురు ముదురు ఘటనలు జరిగే అవకాశం ఉందని అన్నారు.తద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని తెలిపారు.ఈ యొక్క బైండోవర్ ఉల్లంఘన చేసిన వారికి చట్టపరమైనటువంటి చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.అలాగే నియమ నిబంధనలు పాటించి వేడుకలు జరుపుకోవచ్చునని,ప్రతిఒక్కరికీ పండుగ శభాకాంక్షలు తెలియజేసారు.