రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు
రానున్న వర్షా కాలంలో విద్యుత్ సమస్యలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ గారు విద్యుత్
శాఖాధికారులను , మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి లో భాగంగా పవర్ డే పురస్కరించుకొని శుక్రవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన ఎన్ పి డి సి ఎల్ , నగర పాలక సంస్థ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎం ఎల్ ఎ గారు మాట్లాడుతూ వర్షాకాలంలో శిధిలమై విరిగిన స్తంభాలు , వేలాడుతున్న తీగలతో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం వున్నందున వెంటనే సరి చేయాలని ఆదేశించారు.గత పట్టణ ప్రగతి కార్యక్రమంలో దృష్టికి వచ్చి ఇంకా పరిష్కారం కానీ సమస్యలు వుంటే వెంటనే తగు చర్య తీసుకోవాలని ఆదేశించారు. రహదారుల మధ్యలో
ప్రమాదకరంగా వున్న విద్యుత్ స్తంభాలను ప్రక్కకు తరలించాలని ఆదేశించారు. లో వోల్టేజ్ సమస్య ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ వేసిన కొత్త స్తంభాలకు థర్డ్ వైర్ లాగి లైట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన పనులు తక్షణమే ప్రారంభయ్యేలా చర్య తీసుకోవాలని , సదరు కాంట్రాక్టర్ సహకరించని ఎడల ఇతర కాంట్రాక్టర్ తో పనులు పూర్తి చేయాలని లక్ష్మీ చోట్ల కర్రలతో తీగలు పైకి లేపి వుంచారని ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు ప్రస్తావించడంతో డివిజన్ వారీగా విద్యుత్ సమస్యల జాబితా తయారు చేయాలని మున్సిపల్ , ఎన్ పి డి సి ఎల్ అధికారులను ఎం ఎల్ ఎ గారు ఆదేశించారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ డెప్యూటీ మేయర్ నడి పల్లి అభిషేక్ రావు, కమిషనర్ బి . సుమన్ రావు, ఎస్ ఇ చిన్నా రావు , ఇ ఇ యాదగిరి , ఎ ఇ రాంజీ తో పాటు ఎన్ పి సి ఎల్ అధికారులు వెంకటేశ్వర్లు , దేవ స్వామి , కిషన్ , మహీపాల్ రెడ్డి , సంపత్ , అన్వేష్ కార్పొరేటర్లు అడ్డాల గట్టయ్య, పాముకుంట్ల భాస్కర్ , శంకర్ నాయక్ , నాయకులు గోపాల్ రావు , జె వి రాజు , పాత పెల్లి ఎల్లయ్య , బొడ్డు రవీందర్ , తదితరులు పాల్గొన్నారు.
మేయర్ ను సన్మానించిన ఎం ఎల్ ఎ కోరుకంటి చందర్ గారయ
రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ ఇటీవల ఢిల్లీ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో గ్రీన్ అవార్డ్ అందుకోపోవడం పట్ల హర్షం వ్యక్తo చేస్తూ ఎం ఎల్ ఎ కోరుకంటి చందర్ గారయ ఆయనను సత్కరించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన ఎం ఎల్ ఎ ఈ సందర్భంగా మేయర్ కు శాలువా కప్పి , పుష్ప గుచ్చం అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఎం ఎల్ ఎ గారు మాట్లాడుతూ ఎనర్జీ సేవింగ్ లో వరుస అవార్డులు సాదిస్తున్న రామగుండం నగర పాలక సంస్థ ఇప్పుడు గ్రీన్ అవార్డ్ కూడా సాదించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మొక్కలు నాటడం , నర్సరీ లు ఏర్పాటు చేయడం , వాటి సంరక్షణకు స్వశక్తి మహిళల సేవలు వూపయోగించుకోవడం తద్వారా వారికి ఆర్థికంగా తోడ్పడడం వంటి చర్యలతో ఈ అవార్డు లభించిందని అన్నారు.