విద్యుత్ శాఖలో ఒకే ఒక్కడు లైన్ ఇన్స్పెక్టర్

నడి కూడ నేటి ధాత్రి:

మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లొ అన్నీతానై అధికభారమై ఇబ్బంది పడుతున్నవైనం.
పట్టించుకోని పై అధికారులు.
మనోవేదన పడుతూ విధులు నిర్వహిస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ మల్లయ్య.
మండలంలో విద్యుత్ శాఖలో ఏఇ , లైన్ ఇన్స్పెక్టర్ , సీనియర్ లైన్ మెన్ , జూనియర్ లైన్ మెన్ , హెల్పర్ లు ఉండాలి కానీ ప్రస్తుతం ఎఇ , మరియు లైన్ ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. దీంతో మండల పరిధిలో ఏ ఊర్లో సమస్య వచ్చినా ఎఇ లైన్ ఇన్స్పెక్టర్ కె .మల్లయ్య కే అప్పచెప్పడం వల్ల నానా తంటాలు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు. శాఖా పరంగా ఆదాయం సమకూర్చడానికి ఇంటింటికీ తిరిగి బిల్లులు వసూలుచేయాలి , లైన్ ఫాల్ట్ వస్తే కరెంట్ స్తంభాలు ఎక్కాలి , రైతులు పిలిస్తే వెళ్ళాలి, సబ్ స్టేషన్ లో సమస్య ఉంటే సరిచేయాలి ఇవన్నీ కేవలం లైన్ ఇన్స్పెక్టర్ మాత్రమే చేస్తున్నారు. ఇవ్వన్నీ జూనియర్ లైన్ మెన్ విధులు కానీ 57 సంవత్సరాల వయస్సు లో కూడా లైన్ ఇన్స్పెక్టర్ మల్లయ్య భయం భయం గా కరెంట్ పోల్స్ ఎక్కడం , సబ్ స్టేషన్ స్తంభాలు ఎక్కి విధులు నిర్వహిస్తున్నారు. తగిన సిబ్బంది లేక పోవడం వల్ల ఎప్పుడు ఎవరు ఫోన్ చేసిన వెంటనే వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. ఇటు రైతుల నుండి ఒత్తిడి , అటు ఏఇ ఒత్తిడి చేయడం వల్ల మనోవేదన పడుతూ విధులను నిర్వహిస్తున్నాడు. పై అధికారులకు విన్నవించుకున్నా సిబ్బందిని నియమించక పోవడం వల్ల విధుల నిర్వహణ అధిక భారం అవుతుందని మల్లయ్య వాపోతున్నారు. దీనిపై అధికారులు ,స్థానిక ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులు స్పందించి విద్యుత్ సేవలను అందించడానికి తగిన సిబ్బందిని నియమించాలని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!