*జడ్పీటీసీగట్ల మీణయ్య
రుద్రంగి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం విద్యార్థులు క్రీడల్లో రాణించాలని జడ్పీటీసీ గట్ల మీణయ్య అన్నారు.శనివారం రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దయ్యాల విజయ్ కుమార్, అనుముల సంతోష్ అనే విద్యార్థులు వనపర్తి హాకీ అకాడమీకి ఎంపిక కావడంతో వారిని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల పట్ల మక్కువ ఉంటే క్రీడారంగంలో తగిన గుర్తింపు, మానసికోల్లాసంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చునని అన్నారు.చెడు మార్గాలకు అలవాటు పడకుండా క్రీడల్లో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకరావలని అన్నారు.క్రీడాకారులకు తమ సహకారం ఎల్లా వేళలా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంబటి శంకర్, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం,బండారు నర్సయ్య,కంటే రెడ్డి,కేసిరెడ్డి నర్సారెడ్డి,దాసరి గంగరాజం,మంచే రాజేశం,మోతె నర్సయ్య,గంటే ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.