భారత రాష్ట్రీయ సమితి పార్టీ త్వరలో ఆవిర్భావం…
దేశ రాజకీయాల్లో సంచలనం నమోదు కాబోతున్న తరుణం…
దేశ రాజకీయ చరిత్రలో నవశకం….
భవిష్యత్‌రాజకీయాలకు దిశానిర్ధేశం….
త్వరలో ప్రారంభం కానున్న కేసిఆర్‌శకం….
జాతీయ పార్టీ ఏర్పాటుకు వడివడిగా అడుగులు…
దేశ రాజకీయాల్లో సమూల మార్పులకు శ్రీకారం…
రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధి వికాసమే కేసిఆర్ లక్ష్యం…
దేశ రాజకీయాల్లో ఒక సంచనలం నమోదు కాబోతోంది. గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న నవశకం ఆవిషృతం కానుంది. కొత్త రాజకీయ చరిత్రకు శ్రీకారం జరగనుంది. సరికొత్త రాజనీతిజ్ఞతకు నాంది పలకనుంది. ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం కోసం అడుగులు పడనుంది. విద్యావంత సమాజం కోసం దేశం ఎదురుచూస్తోంది. వైద్యపరమైన సమస్యలను అధిగమించే కాలం కోసం నిరీక్షిస్తోంది. వికాసవంతమైన రాష్ట్రాల నిర్మాణం కావాలి. దేశంలో సర్వతోముఖాభివృద్ధి సాధించాలి. దేశం అన్ని రంగాల్లో పరుగులు పెట్టాలి. ఆత్మగౌరవం వెల్లివిరియాలి. ప్రపంచమంతా మనవైపు చూడాలి. మన దేశవికాసం చూసి అబ్బరపడాల. విజయం మన ముంగిట నిలవాలి. గెలుపు మన చిరునామా కావాలి. పరుగు మది మనసును దాటి దిగంతాలు చుట్టిరావాలి. ఆకలి లేని సమాజం, రాజ్యం మన కళ్లారా చూడాలి. సుసంపన్నమైన దేశమని మనం గుర్వపడే రోజులు రావాలి. ఇవన్నీ …నెరవేర్చగలిగే నాయకత్వం సత్వరం మనకు కావాలి. దేశానికి దిశానిర్ధేశం చూపించే నాయకుడై వుండాలి. సంపూర్ణ ప్రగతి సత్వరం మన దేశంలో ఆవిషృమయ్యేందుకు కంకణబద్దుడై వుండాలి. అందుకు పంతం కలిగిన నాయకత్వం కావాలి. పట్టుదలకు మారుపేరైన నాయకుడు రావాలి. పట్టిన పట్టువిడవకుండా దేశపురోభివృద్ధిని కళ్లెదుట నిలిపే నాయకుడు దేశానికి కావాలి. అది తెలంగాణ ఉద్యమ రూపంలో కనిపించాలి. ఎలిగిత్తిన నినాదమై వుండాలి. ఉక్కు సంకల్పంలా వుండాలి. నవతరం, జనతరం మెచ్చిన నవతరం నాయకుడు కేసిఆర్ రావాలి . రేపటి దేశ భవిష్యత్తుకు ఆశాకిరణం కేసిఆర్ కావాలి.
ఇది సగటు తెలంగాణ వ్యక్తి మాత్రమే కాదు, కేసిఆర్ రాజకీయ చాణక్యం, అభివృద్ధి మంత్రం తెలిసిన ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నదే. స్వాతంత్య్రం వచ్చి, డెబ్బై ఏళ్లు పూర్తయినా, ఇంకా మన దేశంలో ఆకలి తీరలేదు. ఆరోగ్యాలు బాగుపడలేదు. విద్య పూర్తి స్ధాయిలో అందుబాటులో లేదు. అందరికీ నీడ లేదు. గూడులేదు. సాగు సరిగ్గా లేదు. సౌకర్యాలున్నా వినియోగించుకునే నాయకత్వం లేదు. సాగుకు నీటి సరఫరా పూర్తి స్ధాయిలో లేదు. వరదలను తట్టుకునేలా ప్రణాళికలు లేవు. కరువును తట్టుకొని నిలబడేంత దూరదృష్టి లేదు. తుఫానులకు చిరుగురాటుకులా వణకుతున్నా శాశ్వత ప్రయత్నాలు చేసింది లేదు. వారికి పూర్తి స్ధాయిలో సాయం చేయగలిగేంత సామార్ధ్యం లేదు. ఉపాధి లేదు. ఉద్యోగాల నిర్వహణ పూర్తి కావడంలేదు. యువతకు ప్రోత్సాహకాలులేదు. వ్యాపార రంగాల్లో పురోభివృద్ధి లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో అనేక రంగాల్లో ఆశించినంత పురోగతి లేదు. ప్రగతి కనిపించడం లేదు. అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ది పాలించే వారికి లేదు. ప్రజలను చైతన్యం చేయాలన్న సోయిలేదు. వారు అడిగిందాన్ని సమకూర్చాలన్న ఆలోచన లేదు. దేశానికి ఏం అవసరమన్నదానిపై శ్రద్ద లేదు. సరైన ప్రణాళిక లేదు. రాష్ట్రాల మీద కేంద్రానికి పెత్తనం తప్ప, పెద్దగా ప్రేమ లేదు. కొన్ని రాష్ట్రాల మీద వున్న ప్రేమ అన్ని రాష్ట్రాల మీద లేదు. ఏ రాష్ట్రం దేనికి ప్రసిద్ది అన్నది అధ్యయంచేసే యంత్రాంగం సరిగ్గా లలేదు. అందుకు తగిన అభివృద్ది చేపట్టాలన్న సూచనలు లేవు. ఏ రాష్ట్రంలో ఎలాంటి వనరులున్నాయి? ఎలాంటి పంటలకు ప్రసిద్ధి? అక్కడి వాతావరణ పరిస్ధితులకు అనుగుణంగా అక్కడ తక్షణ ప్రగతి ఎలా చేయాలన్నదానిపై కసరత్తు లేదు.
ఎంత సేపు రాజకీయాలు…పదవులు…కుర్చీలు…ఇదే ఒకనాడు మన దేశ రాజకీయం బ్యాంకుల్లో వున్న బంగారం కూడా కుదువబెట్టుకునేదాకా వెళ్లింది. అలాంటి ఒకనాడు ఒక తెలంగాణ తేజం దేశానికి ఆశాకిరణమైంది. పి.వి. నర్సింహారావు రూపంలో దేశాన్ని గాడిలో పెట్టే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి దేశానికి అదే పరిస్ధితి ఎదురౌతోంది. ఇప్పుడు కూడా మరో తెలంగాణ చాణక్యుడి నాయకత్వం దేశానికి అవసరమొచ్చింది. అందుకే కేసిఆర్ నాయకత్వం దేశం కోరుకుంటోంది. దేశమంతా ఆయన తిరుగుతూ, రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తూ వస్తున్నారు. అంతే కాకుండా ఉత్తరాధిన కీలకమైన నేతలను కూడా కలిశారు. వారి అభిప్రాయలు తీసుకున్నారు. తన విధానాలు వారికి వివరించారు. సహజంగా కేసిఆర్‌కు వున్న అపారమైన పరిజ్ఞానం వారిని అబ్బురపర్చిందనే చెప్పాలి. అంతే కాకుండా ఆయనకు కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు వున్న దేశ రాజీకయ ముఖ చిత్రం మీద అవగాహన మరెవరికీ లేదు. ఇలాంటి సందర్భంలో మాటకు, మాట కాదు చెపాల్సింది…బిజేపి చేస్తున్న అన్యాయాలను వివరించే ప్రతిపక్షం కావాలి. బిజేపి ఎత్తులకు పై ఎత్తులు వేసే ప్రతిపక్షం రావాలి. జనంలో మతం మత్తును నింపితూ, ఓట్ల కోసమే బిజేపి రాజకీయం చేస్తుందని చెప్పడంలో విధాన పరమైన నిరూపణలు కావాలి.
అవన్నీ ఒక్క కేసిఆర్ వల్లనే సాధ్యమన్నది దేశంలోని రాజకీయ పార్టీలు చాల వరకు గుర్తించాయి. బిజేపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలంటే ఒక్క కేసిఆర్ వల్లనే సాధ్యమని దేశం కూడా గుర్తించింది. ఇది ఉత్తరాధికి చెందిన పత్రికలు కూడా ప్రముఖంగా ప్రచురించిన సందర్భం కూడా వుంది. కేంద్రంలో వున్న బిజేపిని నిక్కచ్చిగా నిగ్గదీసి అడుగుతున్నది కేసిఆరే… కడిగేస్తున్నది ఒక్క కేసిఆర్ మాత్రమే అంటూ ఇండియా టుడే కూడా ప్రకటించింది. అంటే కేసిఆర్ నాయకత్వ పటిమ ఎలాంటిది…ఆయన వ్యాఖ్యల్లో ఎంత పదునుంది? ప్రజలల్లోకి బాణాల్లో దూసుకెళ్లే మాట వాడి, వేడి మరోసారి దేశం గుర్తిస్తోంది. చెప్పే విషయాల్లో సూటితనం కేసిఆర్‌కే సొంతం. స్పష్టతతో కూడుకున్న విషయ పరిజ్ఞానం మరెవరిలోనూ కలినిపించన వైనం. బిజేపిని ఎండగట్టడంతో వున్న నేర్పరితనం ఒక్క కేసిఆర్‌లోనే కనిపిస్తోంది. పైగా కేంద్ర ప్రభుత్వానికి వెరవకుండా, బెదరకుండా నిర్భయంగా ఉతికి ఆరేస్తున్నది ఒక్క కేసిఆరే.. సవాళ్లు విసురుతున్నది కూడా ఒక్క కేసిఆర్ మాత్రమే అన్నది అందరూ గుర్తించారు.
దేశంలో అదీ కరోనా కాలంలో ఉత్తరాధిన రైతులు చేసిన ఉద్యమానికి తోడుగా నిలిచిన నాయకుల్లో కూడా కేసిఆర్ ముందు వరుసలో వున్నారు. రైతులపై బిజేపి నేతలు విరుచుపడుతుంటే కూడా కేసిఆర్ సహించలేదు. వారిని దూషిస్తుంటే కేసిఆర్ ఊరుకోలేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను దూషించడం సరైంది కాదన్నారు. ఎదిరించారు…కేంద్రాన్ని కొంత నిలువరింపజేయడానికి దోహదమయ్యాడు. కేంద్రం చేస్తున్నది తప్పని దుయ్యబట్టాడు. నిలదీశాడు. రైతుల పక్షాన నిలిచాడు. ఆఖరుకు ఏడాదిన్న పాటు పోరాటం చేసిన రైతుల్లో ప్రాణాలు పోయిన వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నంఉచి సాయం అందించారు. తాను రైతునే అని సగర్వంగా చెప్పుకునే పాలకుడు కేసిఆర్. దేశాన్ని బతికిస్తున్న రైతులను గుండెల్లో పెట్టుకోవాలని బిజేపికి హితవు పలికిన ఏకైక నేత కేసిఆర్…
తెలంగాణ కోసం కొట్లాడిన సమయంలోనే ముఖ్యమంత్రి కేసిఆర్ దేశమంతా తిరిగారు. దేశంలో వున్న పరిస్ధితులను పూర్తి స్ధాయిలో అధ్యయం చేశారు. తెలంగాణలోని పరిస్ధితులే చాలా రాష్ట్రాల్లో చూశారు. నీటి పరవళ్లు పక్కనే కనిపిస్తున్నా, పడావు పడ్డ బీడులు చూశాడు. వాటిని నీటితో తడిపి నేలమ్మకు పచ్చని పైటను తొడిగితే ధనరాశులు కురిపించొచ్చు. కాని పాలకుల నిర్లక్ష్యం,చేత కానితనం, లక్ష్యం లేని తనం, రైతులను బాగు చేయాలన్న తపన లేని నాయకులు ప్రతినిధులు కావడం వల్లనే దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే వున్నాయి. వలసలు కొనసాగుతూనే వున్నాయి. ఉపాధి లేక పక్క రాష్ట్రాలు, ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. తెలంగాణలో ఒకప్పుడు ఇదే పిరస్ధితి. కాని ఇప్పుడు ఆ పరిస్దితి లేదు. తెలంగాణలో నీటి పరవళ్లు నాట్యమాడుతూ పరవళ్లు తొక్కుతున్నాయి. పొలలను తడుపుతూ, నేలమ్మను ముద్దాడుతూ పరుగుపరుగున తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నాయి. ఇదంతా కేవలం ఎనమిదేళ్లలో తెలంగాణలో వచ్చిన మార్పు. ప్రగతిని దేశమంతా ప్రశంసించాల్సిందే. అందుకు అనేక రకాలమైన సంక్షేమ పధకాల మిలితంతో ప్రగతిని పరుగులు తీయించడం అన్నది అందరి వల్ల కాదు. అరవైఏళ్లయినా తెలంగాణలో సాధ్యం కాని అనేక సమస్యలను ఆరేళ్లలో పూర్తి చేసి, శభాష్ అనిపించుకున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్. ఒకనాడు తెలంగాణకు దిశ`దశ లేని సమయంనుంచి మహర్ధశకు కారణమైన కేసిఆర్ నాయకత్వం దేశానికి కావాలి. దేశమంతా సస్యశ్యామలం కావాలి. కేసిఆర్ నేతృత్వంలో దేశంలో చైతన్యం వెల్లివిరియాలి. ప్రగతి పరుగులు పెట్టాలి. ప్రపంచంలో భారత్ అత్యంత శక్తివంతమైన దేశం కావాలి. అది తెలంగాణ ప్రజలు కల్లారా చూడాలి…దేశ ప్రజలు మురవాలి. దేశ రూపురేఖలు మారాలి. పసిడి సిరులు కురవాలి. జయహో కేసిఆర్ అని దేశం కొనియాడాలి.