వాళ్లంతా ఒక్కటే! రేవంత్‌ ఒంటరే!!

`రేవంత్‌ నమ్మిన పొంగులేటి కట్టప్ప రూపమే!

`రేవంత్‌ కు షర్మిల రిటన్‌ గిఫ్ట్‌ కోసమే!

`కాంగ్రెస్‌ కోసం రేవంత్‌ ఎంత కష్టపడ్డా వృధానే!

`తెలంగాణ వచ్చినా కాంగ్రెస్‌లో వున్న బానిసలంతా వైఎస్‌ వీర విధేయులే?

`ఇప్పటికీ వాళ్లు చేసేది వైఎస్‌ జపమే!

`తెలంగాణలో షర్మిల రాకకు కారకులే!

`కొట్లాడిరది రేవంత్‌ ఒక్కడే?

` రేపు రేపు రేవంత్‌ కు చుక్కలే?

`షర్మిలను ముందు పెట్టి రేవంత్‌ ను పక్కకు నెట్టుడే!

`పొంగులేటి రూపంలో పొగబెట్టుడే?

`కోమటి రెడ్డి రూపంలో ఇక మొదలైనట్లే?

`ఘర్‌ వాపసీ రేవంత్‌ మెడకే!

`షర్మిల అడుగుతో మళ్ళీ మొదటికే!

`పొంగులేటి కాంగ్రెస్‌ లో చేరడం వెనక వున్నది జగనే!

`ఇదంతా షర్మిల రాజకీయ భవిష్యత్తుకు మార్గమే!

`తెలంగాణలో వైఎస్‌ కుటుంబం పెత్తనం లక్ష్యమే?

`జగన్‌ ను కాదన్న కాంగ్రెస్‌ ను కాళ్లకాడికి తెచ్చుకోవడం కోసమే!

`కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పెత్తనం ఆంద్రా వాళ్లదే?

`షర్మిలను తెచ్చుకొని నెత్తిమీద కుంపటి పెట్టుకోవడమే!

`తెలంగాణ కాంగ్రెస్‌ నేతలది బానిస మనస్తత్వమే!

`షర్మిల రాకను వ్యతిరేకించే రేవంత్‌ ను అదను చూసి సాగనంపుడే?

`బానిస నేతలు మొదటగా చేసే పని ఇదే?

 

హైదరబాద్‌,నేటిధాత్రి:                                   

కొన్ని విషయాలు లోతుగా వుంటాయి. కొన్ని సార్లు గంభీరంగా వుంటాయి. పైకి చిన్నవిగా కనిపిస్తాయి. కాని సార్లు ఉపద్రవాలు సృష్టిస్తాయి. రాజకీయాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒక వ్యక్తి కోసం కొన్ని సార్లు సాగిలపడిపోతుంటాయి. మరి కొన్ని సార్లు వ్యక్తికోసం వ్యవస్థనే కుప్పకూలుస్తాయి. ఇప్పుడు సరిగ్గా తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాల్లో అదే జరుగుతుందా? అన్న అనుమానం కల్గకమానదు. ఆది నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి రేవంత్‌ రెడ్డి రావడం చాలా మందికి ఇష్టం లేదు. కాని ఆయనకు ఆయనగా పట్టుబట్టి మారీ వచ్చారు. ఇలా కాంగ్రెస్‌లోకి వచ్చిన వారు ఆ పార్టీలో మనుగడ సాగించడం చాలా కష్టం. రేవంత్‌రెడ్డి ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంతో ఓపికతో వాటని అదిగమిస్తూ వస్తున్నారు. అయినా అడుగడుగునా ఏదో ఒక ఉపద్రవం వచ్చి వాలుతూనే వుంది. కాని ఈసారి షర్మిల రూపంలో, కేవిపి. రామచంద్రరావు నీడలో వస్తుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది పూర్తి స్ధాయిలో వాస్తవ రూపం దాల్చితే మాత్రం రేవంత్‌రెడ్డికి పదవీ గండం తప్పదు. కాంగ్రెస్‌ పార్టీ పతనం అంతకన్నా తప్పదు. అందుకే కాంగ్రెస్‌ను ఎవరూ చెడగొట్టలేరు. ఎవరూ బాగు చేయలేరు అంటారు. చెడొగొట్టుకున్నా వాళ్లే, బాగు చేసుకున్నా వాళ్లే అన్నది నానుడి. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ను పాత రోజులకు తీసుకోవడం కోసం అందులో వున్న నాయకులే కృషి చేస్తున్నారని చెప్పకప్పదు. ఇక్కడే కేవలం కేవిపి రామచంద్రరావు తన వ్యక్తిగత స్వార్ధం కోసం, జగన్‌ కుటుంబానికి దగ్గరవ్వడం కోసం కొత్త ఎత్తుగడ వేస్తున్నాడు. షర్మిలను తెలంగాణ రాజకీయాల్లో కీలకం చేసి, మళ్లీ ఆ కుటుంబానికి దగ్గరవ్వాలనుకుంటున్నాడు. ఈ లోతైన విషయంపై అవగాహన లేని కాంగ్రెస్‌ నాయకులు షర్మిల రాకను చాల మంది స్వాగతిస్తున్నారు. కాని షర్మిల తెలంగాణ రాకతో మొదటగా రేవంత్‌ కు నష్టం చేస్తే, ఆపై తెలంగాణ రాజకీయాలు మొత్తం ఆగం కావడం ఖాయం. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎపిసోడ్‌ మొత్తం ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెనకుండి కథ స్క్రీన్‌ ప్లే పక్భందీగా నడిపిస్తున్నారనిపిస్తోంది. 

షర్మిల తెలంగాణ రాజకీయాలలోకి వస్తూనే ఖమ్మం జిల్లా రాజకీయాలను తనవైపు తిప్పుకోవడం మొదలుపెట్టింది. నిజానికి తెలంగాణ రాజకీయాల్లో షర్మిలకు చోటు లేదు. తన మొదటి సభను ఖమ్మంలోనే ఏర్పాటు చేసింది. పాలేరు నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించింది. పాదయాత్ర చేపట్టింది. అయితే కాంగ్రెస్‌ దరి చేరడం ఎలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్న సమయంలో కర్నాటక ఎన్నికల ఫలితాలు షర్మిల రాజకీయాలకు మార్గం వేశాయి. నిజానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ నుంచి బైటకు రావడానికి ఇంత కాలం పట్టడానికి కూడా జగనే కారణం అన్నది తెలుస్తోంది. అదును చూసి పొంగులేటి పాచికను జగన్‌ వాడుకున్నాడు. అందుకు పొంగులేటి కూడా సై అన్నాడు. అయితే బిజేపి వైపు మొగ్గు చూపుతున్నట్లు కొంత కాలం ఎపిసోడ్‌ నడిపారు. పొంగులేటి బిజేపిలో చేరినా షర్మిల బిజేపిలో చేరడం కుదరదు. అందుకే ముందు బిఆర్‌ఎస్‌ నుంచి శ్రీనివాస్‌రెడ్డిని బైటకు రప్పించారు. అంతకు ముందే షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి దింపేశారు. ఈ విషయం తెలియక రేవంత్‌రెడ్డి అటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని తొలుత వ్యతిరేకించాడు. షర్మిల తెలంగాణరాజకీయాల్లోకి రావడాన్ని తప్పుపట్టారు. తెలంగాణలో మాకు మేము రాజకీయాలు చేసుకుంటామంటూ చెప్పాడు. దాంతో షర్మిల వీలు చిక్కినప్పుడల్లా రేవంత్‌ను ప్రశ్నిస్తూ వచ్చేది. రేవంత్‌రెడ్డి చేసిన పాదయాత్రపై సెటైర్లు వేస్తూ వచ్చింది. ఇదంతా ముందు నుంచి ఒక పథకం ప్రకారం సాగుతోంది. ఇది రేవంత్‌కు తెలియక పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. కాని తెరవెనుక రేవంత్‌ను వ్యతిరేకిస్తున్న వర్గంలో ముఖ్యమైననాయకులైన కోమటి రెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి,జానారెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే వున్నారు. వీరిలో దివంగత వైఎస్‌కు అనుచరులుగా వున్నవారే ఎక్కువ. వాళ్లుంతా ఇప్పుడు షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. పొంగులేటి రూపంలో సహకారాన్ని తీసుకుంటూ తెలంగాణలో కాంగ్రెస్‌ రాజకీయాల్లో వైఎస్‌ కుటుంబానికి చోటు కల్పించి, కృతజ్ఞత తీర్చుకోవాలని చూస్తున్నారు. పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి తీరని ద్రోహానికి కూడా వీళ్లు పాల్పడుతున్నారు. ఖమ్మం సభపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తయారు చేయించిన పోస్టర్‌లో పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేకపోవడం గమనార్హం. 

 వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి అండగా వుంటూ వచ్చిన కేవిపి తొలుత జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని శతవిధాల ప్రయత్నించాడు. 

కాని ఆయన ఎత్తులు పారలేదు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు. సోనియాగాందీ కేవిపి. సూచనలు పట్టించుకోలేదు. అయినా సమయం చూసి జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని కేవిపి అనుకున్నారు. కాని జగన్‌ అంత కాలం ఆగేందుకు ఇష్టపడలేదు. పైగా ఓదార్పు యాత్ర చేపటొద్దన్న అధిష్టానం సూచనలు జగన్‌ పట్టించుకోలేదు. కేవివి. జగన్‌కు నచ్చ జెప్పే ప్రయత్నాలు చేశాడు. కాంగ్రెస్‌లోనే వుండాలంటూ జగన్‌పై ఒత్తిడి తెచ్చాడు. అయినా జగన్‌ వినలేదు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ జగన్‌పై కేసులు నమోదు.. వంటివి చకచకా జరిగిపోయాయి. ఆ సమయంలో కేవిపి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ప్రశ్నించలేదు. జగన్‌కు మద్దతుగా నిలవలేదు. ఇది జగన్‌ కుటుంబంలో అసంతృప్తిని పెంచింది. జగన్‌ కు కేవిపిని దూరం చేసింది. ఆప్పటి నుంచి జగన్‌ కుటుంబానికి కేవిపి దగ్గరయ్యే ప్రయత్నం చేసినా, జగన్‌ సానుకూలంగా స్పందించలేదు. అప్పుడు జగన్‌ వినలేదు. తాను జగన్‌వైపు నిలవలేదు. ఇప్పుడు షర్మిలకైనా రాజకీయ భవిష్యత్తును సృష్టించి మళ్లీ ఆ కుటంబానికి దగ్గరయ్యే రాజకీయం తెలంగాణలో మొదలుపెట్టారు. ఆ బాధ నుంచి తేరుకునేందుకు ఈ ఎత్తుగడ వేశాడు. కాకపోతే ఇందులో జగన్‌ కూడా షర్మిలకు పరోక్షంగా మద్దతు ప్రకటిస్తూనే, కుటుంబ తగాదాలున్నట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అసలు విషయం బైట పడుతోంది. కేవిపి. రామచంద్రరావుకు కాంగ్రెస్‌ అధిష్టానంలో మంచి పలుకుబడి వుంది. కర్నాకట ఉప ముఖ్యమంత్రి డికే.శివకుమార్‌కు వైఎస్‌కుటుంబానికి మంచి అనుబంధం వుంది. ముందు షర్మిలను అటువైపు నుంచి కాంగ్రెస్‌కు దగ్గర చేసే ఎత్తుగడ మొదలు పెట్టారు. అది సక్సెస్‌ పుల్‌ అ య్యింది. ఇక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చేరడం మాత్రమే మిగిలి వుంది. షర్మిల ఎలాగూ రేవంత్‌ నాయకత్వంలో పనిచేయదు. కొత్తగా చేరిన నాయకులెవరూ రేవంత్‌కు మద్దతు ఇవ్వరు. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు లాంటి వారు కూడా వైఎస్‌ నామస్మరణ ఇప్పటికీ చేస్తున్నవాళ్లే..అందువల్ల రేవంత్‌కాంగ్రెస్‌లో ఇక ఒంటరే… భవిష్యత్తు బైటకే…! చూద్దం ఏం జరుగుతుందో!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!