ఎమ్మెల్యే పెద్దిని మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్,వార్డు ప్రజలు
నర్సంపేట, నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని పదో వార్డు అభివృద్ధి మరింత పెంపొందించడం కోసం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి 1 కోటి 5 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించడం పట్ల ఆ వార్డు కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ తో పాటు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్,వార్డు ప్రజలు ఎమ్మెల్యే పెద్దిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ డెవలప్మెంట్ నిధుల నుండి ఒక కోటి ఎనిమిది లక్షల 45 వేల రూపాయలను మంజూరు చేయించారని పేర్కొన్నారు.నర్సంపేట దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో పదో వార్డు ఔట్స్ కట్ లో ఉన్న వివేకానంద కాలనీ,శివనగర్ పోచమ్మ కాలనీ ఏరియాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేశారని అన్నారు.కొద్దీ రోజుల్లో టెండర్లు పూర్తి చేయించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నాగిశెట్టి పద్మప్రసాద్ తో పాటు వార్డు ప్రజలు మేడవరపు కమలాకర్ రావు, దారా గణేష్, పాషికంటి రమేష్ , కాంతారావు, దేవేందర్ రావు, సాంబయ్యసార్, పరాశకం సదానందం, చంద్రమౌళి, బిక్షపతి, కోడెం సారాంగపాణి, వల్లాల జనర్థన్, ఆరేపల్లి బాబు, పస్తం ఎల్ల స్వామి, షేర్ల శ్రీనివాస్ , పస్తం కృష్ణ, ఆవుల శ్రీకాంత్ ,దోర్నాల రవి , పస్తం రాము, పస్తం ఆకాష్, పస్తం హనుమంతు, తురపాటి అబ్బస్, ఆరెపల్లి కిరణ్, వలస ఆదినారాయణ తదితర వార్డు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు