ఉత్సవాలలో పాల్గొన్న ఎస్సై రాజేష్
రుద్రంగి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని అన్ని గ్రామాలలో వాడవాడలా
అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమైనవి. మండల కేంద్రంలో ఇందిర చౌక్‌లో శ్రీ సర్వజన గణేష్ మండలి, అంబేద్కర్ చౌరస్తాలో ఎస్ ఆర్ ఆర్ యూత్, మహాలక్ష్మి వీధిలో మహాలక్ష్మి గణేష్ ఉత్సవ మండలి, హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ యూత్, కాలేజ్ రోడ్లో డీజే బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో గణనాథుని మండపాలు నిర్మించి ప్రత్యేక పూజలు చేశారు. చిన్న పెద్ద ముసలి ముతక అన్న
భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు.వినాయక చవితి వేడుకల్లో అనేక
రకాల దీప దూప నైవేద్యాలతో అనేక రకాల పూజ కార్యక్రమాల
లో ఉత్సాహంగా చిన్నపిల్లలు యువకులు మహిళలు పాల్గొన్నారు.
వినాయక చవితి వేడుకల్లో రోజుకు ఒక ప్రత్యేకమైన రోజుగా
ప్రత్యేకమైన పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం వేళ యువకులు, మహిళలు
భజనలతో ఆటపాటలతో నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.
ఆటపాటలతో భక్తి భజనలతో చిన్నపిల్లల నృత్యాలు ఇలా జరిగే
ఈ కార్యక్రమాలు ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తాయి.