
రెండు గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు
నడికూడ,నేటి ధాత్రి:
భారీ వర్షాలకు నడికూడ మండలంలోని నార్లాపూర్ వెంకటేశ్వర్లపల్లి గ్రామాల మధ్యలో బ్రిడ్జి,మెయిన్ రోడ్ వరదల కారణంగా కొట్టుకుపోయింది. ఈ విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆ మరుసటి రోజు వచ్చి పరిశీలించి,వర్షాలు తగ్గిన తర్వాత వెంటనే మరమ్మత్తులు చేపడ తామని తెలిపారు. వర్షాలు తగ్గి పదిహేను రోజులు గడుస్తున్న ఇప్పటివరకు ఎలాంటి మరమ్మత్తులు చేపట్టలేదని మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకులు మోలుగూరి బిక్షపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చల్లా కు అతని కాంట్రాక్ట్ పనులు మీద ఉన్న ఆసక్తి నియోజకవర్గంలోని ప్రజలపై ఏమాత్రం లేదని ఎద్దేవా చేశారు. నార్లాపూర్ వెంకటేశ్వర్ల పల్లి గ్రామాల మధ్యన రోడ్డు పూర్తిగా దెబ్బతిని రెండు గ్రామాలకు నిత్యం రాకపోకలు నిలిచిపోయాయి. విద్యార్థులు పాఠశాలలకు కాలేజీలకు వెళ్లి రావడానికి నానా అవస్థలు పడుతున్నారు. రైతులు, మహిళ కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం వారి పంట పొలాలకు వెళ్లడానికి నరకం అనుభవిస్తున్నారు. ఈ గ్రామాల ప్రజలు పట్టణానికి వెళ్లాలంటే కూడా బురదల నుండి ఎత్తుపల్లాల నుండి దాటి వెళ్లి రావడం జరుగుతుంది. నియోజక వర్గ ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు రోడ్డు మరమ్మత్తులు ఇప్పటివరకు చేపట్టకపోవడంతో ఆ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి రోడ్డు మరమ్మత్తులు వెంటనే చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకులు మోలుగూరి బిక్షపతి కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నడికూడ మండల అధ్యక్షుడు గోగుల రాజిరెడ్డి, బిజెపి నాయకులు పరకాల కౌన్సిలర్ ఆర్ పి.జయంత్ లాల్, బిజెపి నాయకులు మంద టునిట్, సురేష్, జగన్,రాజు, నవీన్, సుధీర్, మల్లికార్జున్, మహేందర్, అనిల్, సమ్మిరెడ్డి, ఉదయ్,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.