వరాల తెలంగాణ.

`సుసంపన్నమైన తెలంగాణ.

`ప్రగతి రథ చక్రాల పరుగులు.

`ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం.

`ఇకపై ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు.

`కార్మికుల్లో హర్షాతిరేకాలు.

`హైదరాబాదులో మరో ఎయిర్‌ పోర్టు.

`వరంగల్‌ ఎయిర్‌ పోర్ట్‌ విస్తరణ.

`మిగిలిన ఎనిమిది జిల్లాలలో మెడికల్‌ కాలేజీలు.

https://netidhatri.com/రేవంత్-ఆపరేషన్-కాంగ్ర/

` దేశంలోనే ఇది రికార్డు.

`మెట్రోకు మహార్థశ.

`క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు.

 హైదరబాద్‌,నేటిధాత్రి:                                    

నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఏ ముహూర్తాన దాశరధి అన్నారో నిజంగానే అంతటి గొప్ప తెలంగాణ ఆవిష్కరింపబడుతోంది. తొలి తెలుగు నాగరికతకు పురుగు పోసుకున్న శాతవాహనుల కోటి లింగాల నుంచి, ఇక్ష్వాకులు,విష్ణుకుండినుల నుంచి కాకతీయ రాజుల పాలనలో బంగారు తెలంగాణ కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా ఎంతో గొప్ప తెలంగాణ ఆవిష్కృతమైంది. ఎప్పుడైతే సీమాంద్రులు తెలంగాణతో కలిశారో అప్పటి నుంచి తెలంగాణను పతనం చేస్తూ వచ్చారు. తెలంగాణను గోసపెట్టారు. ఎంతో గొప్ప చరిత్ర వున్న తెలంగాణను చరిత్రహీనంగా మార్చేశారు. తెలంగాణ బతుకు చిద్రం చేశారు. అభివృద్దికి ఆమడ దూరం చేశారు. ఆనాటి నుంచి మొదలై పోరు ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో మలి దశలో విజయం సాధించింది. తెలంగాణ సాధన జరిగింది. పద్నాలుగేళ్లపాటు సాగిన తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తేతే, పదేళ్ల కాలంలో తెలంగాణలో జరిగిన అభివృద్ది ఒక ఎత్తు. ఇదే అభివృద్ది డెబ్బై ఏళ్లుగా సాగితే, తెలంగాణ ఇప్పటికే ఒక గొప్ప ప్రాంతంగా విరాజిల్లేది. తెలంగాణ సందన దోచుకోవడానికి కలిసిన సీమాంధ్రులు, తెలంగాణను పీల్చి పిప్పి చేయడానికే ప్రాదాన్యమిచ్చారు. తెలంగాణ నీటి వాటాలు వాడుకుంటే సీమాంద్రకు కష్టాలని ప్రాజెక్టులు నిర్మించలేమని మభ్యపెడుతూ మోసం చేశారు. తెలంగాణ నాయకుల రాజకీయ అవకాశవాదులను గుప్పిట్లో పెట్టుకొని తెలంగాణను అడుగడుగునా, అణువణువునా మోసం చేశారు. తెలంగాణకు భవిత లేకుండా చేశారు. 

 తెలంగాణ అంటే ఒక శకం.

 ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటే ఒక నవ శకం. అరవై ఏళ్ల గోసను తీర్చడానికి కారణజన్ముడై వచ్చిన కేసిఆర్‌ తెలంగాణను బంగారు తునక చేస్తున్నాడు. భవిష్యత్తు తరాలకు బంగారు మయమైన తెలంగాణ అందిస్తున్నాడు. సరిగ్గా పదేళ్ల క్రితం తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ ఊహిస్తేనే ఆ ఊహ కూడా ఆశ్చర్యపోతుంది. నాడు దిగాలు పడిన తెలంగాణ నేడు సంబరంతో నాట్యమాడుతుంది. అంతగొప్పగా తెలంగాణ ఆవిష్కరణ జరుగుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ప్రగతి, పురోగతి ఒక్క తెలంగాణలో వుంది. అది కేసిఆర్‌ నాయకత్వంతోనే సాధ్యమౌతోంది. తెలంగాణ ను వరాల తెలంగాణ చేసి, తెలంగాణ ప్రజ కలలు గన్న తెలంగాణ అందిస్తున్నారు. సుసంపన్నమైన తెలంగాణను బహుమానంగా ఇస్తున్నాడు. తాజాగా క్యాబినేట్‌ నిర్ణయాలు తెలంగాణకు మరింత వన్నెలు అద్దేలా వున్నాయి. అందులో ప్రజల కోరికలతో పాటు, రేపటి తరం ఆశలు కూడా తీరే నిర్ణయాలు తీసుకున్నారు. 

ఎప్పటి నుంచో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని కోరుతున్నారు. 

దానిపై గతంలోనే సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ నివేదికను అనుసరించి వచ్చే అసెంబ్లీలో బిల్లు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆర్టీసీలో పనిచేస్తున్న 43వేల మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నవారు, ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటి దాకా కార్పోరేషన్‌ పరిధిలో ఉద్యోగులుగా వున్న వాళ్లంతా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఇది గొప్ప శుభ తరణం. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది గొప్ప పాత్ర. సకల జనుల సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికులు అప్పటి ఉమ్మడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. నిత్యం ధీక్షల్లో కార్మికులు కూడా భాగస్వాములయ్యారు. అంతే కాకుండా కొత్తగా రిక్రూట్‌ చేసుకొని కొత్తవారితో ఆర్టీసీ నడిపేందుకు అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా దాన్ని అడ్డుకోవడంలో కూడా విజయం సాధించారు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికులది ప్రత్యేక పాత్ర. అందుకే తెలంగాణ వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆర్టీసి కార్మికుల జీతాలు గణనీయంగా పెంచారు. 53శాతం ఫిట్‌ మెంటు ఇచ్చి ఏవరూ ఊహించని కానుకనందించారు. ఆ తర్వాత తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ కోరుతూ వచ్చారు. వారి కోరికను మన్నించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ గతంలోనే ఓ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. దాని ఫలితమే ఇప్పుడు వారిని ఉద్యోగులుగా గుర్తించి, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసుకోడం జరుగుతోంది. 

 ఇక హైదరాబాద్‌ ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పిన విధంగానే హైదరాబాద్‌ను గొప్పగా ఆవిష్కరించారు.

 అటు ఉద్యమ సాధనకు విజయాలుగా పల్లె నుంచి మొదలు పట్నం దాకా మౌలిక వసతుల సదుపాయాల కల్పనతో తెలంగాణను అగ్రగామిగా నిలిపారు. తాజాగా మంత్రి మండలి నిర్ణయం మేరకు నగరం చుట్టూ సుమారు 500 కిలోమీటర్ల పరిధిలో మెట్రోను విస్తరించడానికి తీసుకున్న నిర్ణయం భవిష్యత్తు తెలంగాణను ఊహించుకుంటేనే అందమైన భూతల స్వర్గంగా మారనుంది. ప్రస్తుతం సుమారు 73 కిలోమీటర్ల పరిధిలో వున్న మెట్రోను నగరానికి నాలుగు వైపులా విస్తరిస్తే, హైదరాబాద్‌ దేశంలోనే అతి పెద్ద నగరంగా ఆవిషృతమౌతుంది. తూర్పున ఉప్పల్‌ నుంచి బిబీ నగర్‌ వరకు మెట్రోను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పశ్చిమాన శంషాబాద్‌ వరకు విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎల్బీనగర్‌ నుంచి పెద్ద అంబర్‌ పేట వరకు విస్తరణ జరగనుంది. ఉప్పల్‌ నుంచి ఉత్తరం వైపు ఈసిఐఎల్‌ వరకు చేపట్టనున్నారు. అటు మియాపూర్‌ నుంచి లక్డికాపూల్‌కు, రాయదుర్గం నుంచి శంషాబాద్‌, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు మెట్రో విస్తరణ జరిగితే నగరంలో ట్రాఫిక్‌సమస్య వుండదు. హైదరాబాద్‌ విస్తరణ మరింత పెరుగుతుంది. హైదరాబాద్‌కు చుట్టూ 50 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. ఇక మరో సరికొత్త ఆవిష్కరణ. జేబిఎస్‌ నుంచి తూంకుంట వరకు డబుల్‌ డెక్కర్‌ ప్లైఓవర్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ఇదిలా వుంటే నగరంలో మరో ఎయిర్‌ పోర్టు ఏర్పాటు అసరమని ప్రభుత్వం గుర్తించింది. హకీం పేట ఎయిర్‌పోర్టును వాడుకునేందుకు అవసరమైన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. ఇప్పటికే ఐటి రంగం విస్తరించి, ఫార్మా రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ పూర్తయితే నగరం రూపు రేఖలే మారిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *