ఎండపల్లి నేటి ధాత్రి
వన దేవతలుమేడారం సమ్మక్క-సారలమ్మ లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి దర్శించుకున్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా పసుపు, కుంకుమను వనదేవతలకు సమర్పించుకున్నారు.
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మీద ప్రత్యేక పూజలు చేశారుమాజీ మంత్రి వెంట బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, గంగుల అశోక్, నర్సింగరావు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏలేటి కృష్ణా రెడ్డి, యంపిపి ముత్యాల కరుణ శ్రీ, పి.ఎ.సి.ఎస్ చైర్మన్ లు, బలరాంరెడ్డి, గూడ రాంరెడ్డి, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వనదేవతలను దర్శించుకున్న మాజీ మంత్రి కొప్పుల
