ఏబీఎస్ఏఫ్ జిల్లా కన్వినర్ నాగుల పవన్ కళ్యాణ్
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో ఏబీఎస్ఏఫ్ నాయకులా సమావేశం నిర్వహించారు అనంతరం ఏబీఎస్ఏఫ్ జిల్లా కన్వీనర్ నాగుల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విద్యారంగా ఉమ్మడి జిల్లాలో ఎక్కడ విద్యార్థులకు అన్యాయం జరిగిన ఏబీఎస్ఏఫ్ జెండా పట్టుకొని వారికీ అండగా నిలుస్తున్న ఏబీఎస్ఏఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మంద నరేష్ బీఎస్పీ టికెట్ ను పరకాల, భూపాలపల్లి నుండి ప్రకటించాలని అన్నారు అంబేద్కర్ ఫూలే కాన్షిరాం ఆశయా సాధకుడు తెలంగాణా ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి మంద నరేష్ అన్నారు బీఏస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ స్పందించి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడైనా మంద నరేష్ భూపాలపల్లి ,పరకాల టికెట్ ఇస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఎస్పీ పార్టీకి అండగా ఉండి సపోర్ట్ చేస్తాము అని అన్నారు ఈ సమావేశంలో ఏబీఎస్ఏఫ్ మండల అధ్యక్షులు తూర్పటి రాజ్ కుమార్, కార్యదర్శి నజీర్,ఉపాధ్యక్షులు అంబాల లక్ష్మణ్, అభివర్ధన్, మేకల అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.