జనగామ టిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి
-స్వార్థం కోసం పార్టీలు మారిండు.. కొమ్మూరి
-కాంగ్రెస్ అభ్యర్థివి ఊసరవెల్లిల మాటలు
-వారి కల్లేబోల్లి కథలు చెప్తారు వినకండి
-హనుమంతుడు లేని ఊరు లేదు..కేసీఆర్ పథకాలు లేని గ్రామం లేదు
-కెసిఆర్ పంపిన మీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని
-చేర్యాల గ్రామాల్లో విస్తృత ప్రచారం..
-గడపగడపకు ఘనస్వాగతం పలికిన ప్రజలు
-కారు గుర్తుకు ఓటు వేస్తామంటున్న స్థానికులు
-కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి చేరికలు
చేర్యాల నేటిధాత్రి జనగామ నియోజకవర్గ పరిధి చేర్యాల మండలం రాంపూర్, కాశిగుడిసెలు, ఆకునూర్, కొత్త దొమ్మట, చుంచునకోట, వీరన్న పేట గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు..స్థానిక నాయకులతో కలిసి
పల్లా రాజేశ్వర్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఆయా గ్రామాలకు వెళ్లినప్పుడు ముందుగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కాగా పల్లా ప్రచారానికి జనం నుంచి అపూర్వమైన స్పందన వస్తోంది. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. ప్రభుత్వం చేపట్టిన ప్రగతి, సంక్షేమ కార్య క్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు ఈ సందర్భంగా.జనగామ బిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్.
ఆకునూరు అంటే శతపత్ర పురం.. ఇక్కడి ఒక్కో గుడికి ఒక్కో చరిత్ర ఉంది.ఆనాటి రుద్రమ దేవి ఈ ఆకునూరుకు వచ్చి పూజలు చేసిందంటే.. ఇది పుణ్యభూమి..అలాంటి పుణ్యభూమిలో పుట్టిన ఆడబిడ్డలకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న..చేర్యాల, ఆకునూరు గురించి సీఎం కేసీఆర్ గురించి సీఎం కేసీఆర్ చెబితే.. నాకు ఆ ఊళ్ల గురించి చెబుతావా.. అక్కడ చాలా మంది దోస్తులున్నరు…అని సీఎం కేసీఆర్ నాకు చాలా సార్లు చెప్పిండు. అక్కడనున్న సమస్యలు కూడా నాకు తెలుసు.. నీకేమన్నా ఉంటే రాసుకో రా.. నేను నిధులు కేటాయిస్తా అని నాకు చెప్పాడు.నేను ఉద్యమం చేసినప్పుటి నుంచి జనగామ, చేర్యాల పట్టణాలు నాతో కలిసి నడిచినయని, నాకు అండగా ఉన్నాయని సీఎం కేసీఆర్ చాలా సార్లు చెప్పాడు.నేను ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చిన… ఇక్కడ అభివృద్ధి కోసం రూ. 70 కోట్లు కావాలంటే సీఎంరూ. 72 కోట్లుఇచ్చిందు.. నా నిధులు రూ.4 కోట్లు రోడ్లకోసం కేటాయించిన.చేర్యాల ప్రాంత రాకపోకలు గజ్వేల్, సిద్దిపేటకు ఉన్నాయి.. నేను జనగామ, చేర్యాలకు పోయినప్పుడు వారంతా నన్ను అడుగుతున్నారు. మా ప్రాంతాలకు అధిక నిధులు కావాలి సార్.. గజ్వేల్, సిద్దిపేట లెక్క చేయాలని.. ఈ విషయాన్ని సీఎంకు చెప్పిన…
ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ఊసర వెళ్లిలా నాలుగు సార్లు పార్టీ మార్చిన వ్యక్తి.తెలంగాణ పోరాటం చేసినప్పుడు అతడికి ఓట్లేస్తే వైఎస్సార్సీపీకి అమ్ముడుపోయిండు.వైఎస్సార్సీపీ నుంచి బీఆర్ఎస్ కు అక్కడ నుంచి బీజేపీకి ..అక్కడ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ..అంటే ఒక్కో ఎన్నికప్పుడు ఒక్కో పార్టీ మారుతడు.నీకు నిజాయితీ ఉంటే.. పింఛన్లు, ఇళ్లు, రోడ్లు ఇలా అభివృద్ధి చేసే పనుల్లోపోటీ పడాలే..సేవ చేయాలే కానీ ఉత్త మాటలు మాట్లాడొద్దు.మనం పథకాలు ప్రవేశపెట్టి పక్కాగా అమలు చేస్తుంటే ఈ పథకాలను కాపీ కొట్టి కాంగ్రెస్ వాళ్లు..పథకాలను కేసీఆర్ అర్రాస్ పెడుతున్నడు అంటున్నరని ఆరోపణ లు చేయడం సిగ్గు చేటన్నారు.గ్రామంలో ఉండే సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లకు నిధులు ఇస్తా. దేవాలయాల పనులు కూడా పెండింగ్ లో ఉంటే త్వరలోనూ పూర్తి చేయిస్తా.ఆకునూరులో అతిపెద్ద మహిళా భవననిర్మాణానికి కృషి చేస్తా…అందులో అన్ని సౌకర్యాలు ఉండేలా చేస్తా..దుర్గమ్మ, ఎల్లమ్మ, బ్రహ్మంగారి గుడులు అభివృద్ధి చేస్తా.. లైబ్రరీ, అన్ని సామాజిక కమ్యూనిటీ హాళ్లు కూడా మంజూరు చేయిస్తా.అండర్ గ్రౌండ్ డ్రైనేజీకకోసం రూ.6 కోట్లు కావాలని అడిగారు. అది కూడా మంజూరు చేయిస్తా..
-ఓపెన్ జిమ్ కు సంబంధించి ఈ వారంలో పెట్టుకుంటే నా సొంత డబ్బులు ఇస్తా.ఊళ్ల కొందరికి బీడీల పించన్, ఆసరా పించన్ రావడం లేదని అక్కలు చెప్పారు. నెల రోజుల్లో అధికారులను ఇక్కడే కూర్చండబెట్టి అర్హులందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటా..ఇక గృహ లక్ష్మి ఇండ్లు ముఖ్యమంత్రి 3 వేలు ఇచ్చాడు.. సీఎంను ఇంకాకొన్ని కావాలని అడిగితే 6 వేలు ఇచ్చిండు.. మొదటి ప్రాధాన్యాత గా అకునూరుకు ఇండ్లు ఇస్తా.దళిత బంధు కూడా అందరికీ వస్తయి. కాస్తా ఆలస్యమైనా దళితులందరీకీ ఇళ్లు ముందు కట్టించే బాద్యత నాదే.ఎస్సీలకు దళిత బంధు, గృహలక్ష్మి అందరికీ అందేలా చేస్తా.18 ఏళ్లు నిండిన వారందరికీ సౌభాగ్య లక్ష్మి కింది రూ. 3000 పింఛన్లు ఇస్తున్నారు.వచ్చే నెల నుంచి రూ. 400 కే గ్యాస్ బండ వస్తంది. ఇలా పింఛన్, గ్యాస్ , సన్నబియ్యం అన్నీ సీఎం కేసీఆర్ సారే ఇస్తున్నారు.సమాజంలో అందరూ బాగుండాలి. ఊళ్లో ఒక్కరిద్దరు బాగా లేకపోతే మనకు బాగనిపించదు.. ఇయ్యాల ఇక్కడున్న దళితులు, అన్నదాతలు, పేద ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.వ్యవసాయకూలీలు, ఇతర పురుగులు, విత్తనాల ధరలు , కోత మిషన్ తదితర ఖర్చులన్నీ పెరిగినయ్ . దీంతో రైతు బంధు కింద ఇచ్చే రూ.10 వేలు సరిపోవడం లేదని, వాటిని రూ 16 వేలు ఇవ్వనున్నారు. రైతు బీమా కింద ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 5 లక్షలు ఇస్తున్నారు. దానిని భూమి జాగ లేకున్నా, కౌలు రైతులకు ఇలా గ్రామంలోని అందరికీ కేసీఆర్ బీమా కింది రూ. 5 లక్షలు ఇవ్వనున్నారు.
యువతకు ఏం కావాలో వాటిని గుర్తించి వానిటి అన్నింటినీ తీరుస్తా అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉల్లింగాల ఏకనాదం మండల శ్రీరాములు సుంకరి మల్లేశం పాల బాలరాజు తాటికొండ సదానందం పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు