రైతు కుటుంబాలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం

  •  రూ. కోటి 10 లక్షల విలువైన రైతుబీమా చెక్కుల వితరణ

  •  ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట, నేటిధాత్రి :

దేశానికి అన్నం పెట్టే రైతు ఆకాల మ‌ర‌ణం పొందితే వారిపై ఆధార ప‌డ్డ‌ కుటుంబం రోడ్డున ప‌డుతుందని ,రైతు బ‌తికున్న‌ప్పుడు ఎంత గౌరవంగా బ‌తికారో య‌జ‌మాని చ‌నిపోయాక కూడా అంతే గౌర‌వంగా బ‌త‌కాల‌నే ఉద్దేశ్యంతో రూ.5 ల‌క్ష‌ల‌ ప్ర‌మాద బీమా ను కుటుంబాలకు అందిస్తూ యావ‌త్ ప్ర‌పంచం మెచ్చే విధంగా అలాగే ఐక్య‌రాజ్య‌స‌మితి అభినందించే విధంగా ప‌థ‌కం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉన్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. నియోజవర్గంలోని పలు మండలాలలోని 22 మంది రైతులు వివిధ కార‌ణాలతో మృతి చెందగా వారి కుటుంబాలకు ఒక్కొక్క‌రికి టీ 5 ల‌క్ష‌ల చొప్పున రూ. కోటి 10 ల‌క్ష‌ల విలువైన చెక్కుల‌ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో పంపిణి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ ఇప్పటివ‌ర‌కు న‌ర్సంపేట నియోజ‌కవ‌ర్గ వ్యాప్తంగా దాదాపు 442 మంది రైతుల‌ కుటుంబాలకు రైతుబీమా పథకం ద్వారా రూ. 22 కోట్ల 10 లక్షలు, అదేవిధంగా 66531 మంది రైతులకు రైతుబందు పథకం ద్వారా 57 కోట్ల 18 లక్షల రూపాయల నగదును అందజేసినట్లు తెలిపారు. రైతుబీమా ప‌థ‌కం వ‌ల‌న యావ‌త్తు తెలంగాణ రైతులు భ‌రోసాగా బ్ర‌తుకుతున్నార ని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఏడీఏ శ్రీనివాస్ రావు, ఎంపిపిలు, జెడ్పిటిసిలు, అర్ ఎస్ ఎస్ డైరెక్టర్లు, రైతుబందు కమిటీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపిటిసిలు, సర్పంచ్లు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!