రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు కలెక్టర్ కె.శశాంక

 

మహబూబాబాద్,నేటిధాత్రి:

రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్తి కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు.

శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో పత్తి కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,దిగుబడి అంచనాల మేరకు కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.జిల్లాలో వానాకాలం-

2022 -23 సీజన్ లో 91,385 ఎకరాల్లో పత్తి పంట వేసినట్లు, ఇందులో 7లక్షల 31 వేల 080 క్వింటాళ్ల పంట ఉత్పత్తి అంచనా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.8శాతం తేమ కలిగిన రకానికి క్వింటాలుకు 6380/- రూపాయలు కనీస మద్దత్తు ధర లభించనుందని, రైతులు నాణ్యత ప్రమాణాలు కలిగిన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తెచ్చే విధంగా చూడాలని,అవసరమైన తేమ శాతం నిర్ధారణ,తూకం యంత్రాలు సిద్ధంగా ఉంచాలన్నారు.ప్రతి కేంద్రం వద్ద రవాణాకు వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు.నాణ్యత ప్రమాణాలను,తేమశాతాన్ని పాటించే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.తూనికలు, కొలతలు శాఖ ద్వారా జిన్నింగ్ మిల్లుల తూకపు మిషన్లను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలన్నారు.

పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో 5 జిన్నింగ్ మిల్లులు, రోజుకు 1250 బేళ్ళ సామర్థ్యం కలవి ఉన్నాయనీ,కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా పత్తికి కనీస మద్దతు ధర, వానాకాలం 2022-23 నాణ్యత ప్రమాణాలపై రూపొందించిన 

పోస్టర్ ను జిల్లాకలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, 

జిల్లా మార్కెటింగ్ అధికారి వెంకట్ రెడ్డి,సి.సి. ఐ. అధికారి 

ఎం.ఉమామహేశ్వర

రావు,ఇంఛార్జి జిల్లా వ్యవసాయ అధికారి ఎం. లక్ష్మినారాయణ,ఆర్.టి.ఓ. రమేష్ రాథోడ్,అగ్నిమాపక శాఖ అధికారి డి.నాగేశ్వరరావు, లీగల్ మెట్రోలజీ అధికారి ఎస్.విజయ్ కుమార్, డి.ఎస్.పి. డి.రమణ , తొర్రూరు, మహబూబాబాద్ ఎ.ఎం.సి.చైర్మన్లు పి.శాంత, బి.ఉమ ,కార్యదర్శులు ఎన్.రాజ,

జి.రాజేందర్,జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు ఎ.వేణుగోపాల్ రెడ్డి, ఎస్.జనార్ధన్,రవికిరణ్,

తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!