జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎస్ జితేందర్ రెడ్డి.
రాజన్న సిరిసిల్ల టౌన్: నేటిధాత్రి
పౌరసరఫరాల శాఖ హైదరాబాద్ వారి ఆదేశానుసారం
ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకత
తీసుకు వచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి
రేషన్ కార్డులకు ఈ కేవైసీ నమోదు ప్రక్రియలు
భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎస్ జితేందర్ రెడ్డి జిల్లాలో పలు రేషన్ దుకాణాలలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల శాఖ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం రేషన్ కార్డులో పేర్లు కలిగిన ప్రతి ఒక్కరు తమ పేర్లను ఈ కేవైసీ లో సమాచారాన్ని
పొందుపరచాలని రేషన్ డీలర్లకు సూచించారు అదేవిధంగా రేషన్ కార్డుదారుల సమాచారాన్ని
ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉండే విధంగా అధికారులు చూడాలని సూచించారు ప్రతి ఒక్క రేషన్
కార్డుదారులకు బియ్యం తీసుకునేందుకు వచ్చిన వారికి
అవగాహన కల్పించి కుటుంబ సభ్యులంతా నమోదు చేసుకునేలా చొరవ చూపాలని అన్నారు.