గుట్టలు మింగుతున్నారు?
అధికారులు చోద్యం చూస్తున్నారు!
యదేచ్చగా గుట్టలు నేలమట్టం చేస్తున్నారు.
రాత్రికి రాత్రే ఆనవాలు లేకుండా మొరం తరలిస్తున్నారు.
రోడ్డు విస్తరణ పేరిట అక్రమ తవ్వకాలు
గాడితప్పిన మైనింగ్ అధికారులు
ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్నారు.
వేములవాడ:నేటిధాత్రి న్యూస్: రాజన్నసిరిసిల్లా వేములవాడ విలీన గ్రామం నాంపల్లి శివారు గుట్టలు అక్రమార్కులకు బంగారు నిధిగా మారాయి. ఆదివారం సెలవు దినం కావడంతో సిరిసిల్ల బైపాస్ రోడ్డు పేరిట ఎలాంటి అనుమతులు, వే బిల్లులు లేకుండానే సమయపాలన పాటించకుండా ఉదయం నుండి రాత్రి వరకు గుట్టను తోడేశారు. అసలే సెలవు దినం
దీనికి తోడు అధికారుల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. వార్త కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టులకు సైతం బెదిరింపులు తప్పడం లేదు. అంటే ఏ స్థాయిలో మైనింగ్ అక్రమ రవాణా సాగుతుందో ఇట్టే అర్థమవుతుంది. తహసిల్దార్ అర్బన్ వేములవాడ(ఎన్ఓసి)ఎల్ ఆర్.నెం.ఈ/280/2020 తేది 25-02-2022.డీడీఎం&జి.మెమో నెం. &తేదీ : 1329/టీపీ2/2021 తేదీ: 06-01-
2022 ,1522/టీపీ4/కరీంనగర్/2022,తేదీ:22-04-2022,1522టీపీ4/2022,తేదీ: 17-08-2022
తహసిల్దార్ అర్బన్ వేములవాడ (ఎన్ఓసి)ఎల్ ఆర్.నెం.ఈ/53/2022,తేదీ:25-02-2022డీడీఎం&జీ,మెమో.నెం. &తేదీ:1329/టీపీ2/2021,తేదీ:26-03-2022
1522/టీపీ4/కరీంనగర్/2022-2,తేదీ:29-07-2022
తహసిల్దార్ అర్బన్ వేములవాడ (ఎన్ ఓ సి)ఎల్ ఆర్.నెం.ఈ/114/2020,తేదీ : 25-02-2022,
1329/తీపి2/2021-2,తేదీ : 09-03-2022,
1522/టీపీ4/కరీంనగర్/2022,తేదీ: 17-05-2022 ,
1522/టీపీ4/కరీంనగర్/2022-1. తేదీ: 29-07-2022
తహసిల్దార్ అర్బన్ వేములవాడ (ఎన్ఓసి) ఎల్ ఆర్.నెం.ఈ/130/2022,తేదీ: 25-02-2022,
డీడీఎం&G,మెమో.నెం.& తేదీ:1329/టీపీ2/2021-1,తేదీ:09-03-2022 తేదిల ప్రకారం తవ్వకాలకు అనుమతి ఇచ్చారు.
గతంలో 2017వ సంవత్సరం ఫిబ్రవరిలో రగుడు నుండి వెంకటాపూర్ గ్రామం వరకు 11 కిలోమీటర్లు నాలుగు వరుసల బైపాస్ రోడ్డు నిర్మాణం ఎం/ఎస్ కెఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కరీంనగర్ సంస్థ పనులు చేపట్టింది. ఇట్టి రోడ్డు నిర్మాణానికి 5.79 క్యూబిక్ మీటర్ల మట్టి అవసరం ఉండదని ఆర్ అండ్ బి అధికారులు తెలిపారు. ఆ నిర్మాణానికి ఫిబ్రవరి 26/2022 వరకు4.91క్యూబిక్ మీటర్ల మట్టి వాడారు. అనుమతులు లేకుండా ఇట్టి రోడ్డు కు వాడిన
4.91క్యూబిక్ మీటర్ల మట్టి ఎక్కడి నుండి తెచ్చారో అధికారులకే తెలియాలి. గతం లో జిల్లా కలెక్టర్ కార్యాలయం భారీ వర్షాలకు గురైనప్పుడు కూడా ఎలాంటి అనుమతులు లేకుండానే రవాణా చేసుకున్నారు. కానీ ఆ మొరం ఏ స్థలం నుంచి వచ్చిందో అధికారులకు ఇప్పటికీ తెలియదు. సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్డు ఎల్లమ్మ దేవాలయం వరకు4.70 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఎమ్/ఎస్ శ్రీ అయ్యప్ప కన్స్ట్రక్షన్ కరీంనగర్ 27-05-2022 రోజున రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ రోడ్డుకు1.16.560 క్యూబిక్ మీటర్ల అవసరం ఉందని ఆర్ అండ్ బి అధికారులు తెలియజేశారు. కానీ 18-7-2022వరకు 100240 క్యూబిక్ మీటర్ల మట్టిని వాడారు. ఆ మట్టి కూడా ఎక్కడినుంచి తెచ్చి వాడారు? ఒక క్యూబిక్ మీటర్ మట్టి తవ్వకానికి ప్రభుత్వానికి 30 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మొరం తవ్వకాలు జరిగిన కూడా అధికారుల వద్ద ఎలాంటి సమాదానం లేదు. సరైన సమాచారం కూడా లేకపోవడం గమనార్హం. ఎలాంటి పన్ను వసూలు చేయకపోవడం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై అధికారులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.