
5 రోజుల్లో వ్యవసాయ మార్కెట్ లో యాంత్రీకరణ మేళ.
రోత రాజకీయాలు ఉచ్చిలిపాటు తనంతో ప్రతిపక్ష నాయకులు
వంద రోజుల టాస్క్ ముందు ఉన్నది…నర్సంపేట అభివృద్ధి మరింత ముందుకు
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి :
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో సన్న, చిన్నకారు రైతులకు చేయితనిచ్చేందుకు గాను నర్సంపేట నియోజకవర్గ రైతుల మెడల్లో రూ.రూ.70 కోట్లతో అత్యాధునాతన వ్యవసాయ యాంత్రీకరణ హారం వేయనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పూర్తి స్థాయిలో మెరుగుపరిచేందుకు దేశ వ్యాప్తంగా వాడుతున్న అత్యంత అత్యాధునిక వ్యవసాయ యాంత్రీకరణ యంత్రాల హారాన్ని ఈ ప్రాజెక్టు ద్వారా తెస్తున్నట్లు ఇది రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టుగా నర్సంపేటకు వస్తున్నదని పేర్కొన్నారు.రూ.75 కోట్ల రూపాయల నిధులకు అనుమతు రాగా 50 శాతం సబ్సిడీతో 38 రకాల యంత్రాలు అందుబాటులో ఉంటాయని దీంతో 51 వేల రైతు కుటుంబాలు అవకాశం పొందవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.38 రకాల యంత్రాలలో 18 వేల పివిసి పైపుల యూనిట్,హెచ్ డీపీఈ పైపులు, రోటోవేటర్లు, 3 వేల కరెంటు మోటార్లు, 30 వేల టార్పలీన్ కవర్లు, మినీ ట్రాక్టర్లు, అగ్రికల్చర్ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్, కలుపు తీసే యంత్రాలు, 4 వేల తైవాన్ పైపులు, మల్టీ క్రషర్స్,ప్యాడి ప్లాంటేషన్ మిషన్స్ (వరి నాటు యంత్రాలు), కాటన్ పికింగ్ మిషన్స్, స్ప్రేయర్స్, హార్వెస్టింగ్ మిషన్లు, టిల్లర్స్, మోడ్రన్ హ్యాండ్ టూల్స్, రైతులకు ఉపయోగపడే వివిధ పరికరాల యూనిట్లు ఈ ప్రాజెక్టులో సబ్సిడీపై అందించనున్నామని వివరించారు.మరో త్వరలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు అవగాహన చూపించేందుకు ఈ అధునాతన వ్యవసాయ యాంత్రీకరణ యంత్రాల మేళా కార్యక్రమం నిర్వహించి వెంటనే ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టు దరఖాస్తు కోసం రైతులు ఆఫ్ లైన్ పద్దతిలో రైతు వేదికల వద్ద నిర్వహణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రైతులు ఏది అడిగితే అది అందుబాటులోకి ఉండే ఈ ప్రాజెక్టు పూర్తిగా వచ్చే వారం రోజులు లాంచింగ్ కానున్నట్లు ఇది నర్సంపేటలో మరో రైతు చరిత్ర సృష్టిస్తుందన్నారు.టెండర్ ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ యంత్రాల ప్రక్రియ ఉంటుందని, గుర్తింపు పొందిన కంపెనీల ద్వారా రైతులకు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వస్తాయని అలాగే సబ్సిడీ కోసం బ్యాంకర్లతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
ఇప్పటికీ రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టులు,మిషన్ కాకతీయ,చెక్ డ్యామ్స్ ,నీటి గుంటల పట్ల ముందంజలో ఉన్నామని, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నర్సంపేట సాగునీటి ప్రాజెక్టు పట్ల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడారని అది మన విజయం అని పేర్కొన్నారు.నేను మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గ అభివృద్ధిపై రాజకీయాలకు తావివ్వకుండా కసితో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే పెద్ది తెలిపారు.
# ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే ….
రైతుల పట్ల మాట్లాడడానికి ప్రతిపక్ష పార్టీలకు దమ్ము ఉన్నదా అని ప్రశ్నించారు.2014 ముందు వరదల సమయంలో నియోజకవర్గంలో రైతులు నష్టపోతే సానుభూతిగా వచ్చిన రైతులకు పరిహారం ఇస్తానని హామీలు ఇచ్చిన వారు ఇప్పటికీ పత్తాలేరని ఎద్దేవా చేశారు.వడగండ్ల వానల వలన నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ పరిహారం అందించేందుకు పంటల పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రి వస్తే రైతుల పట్ల దరఖాస్తు అవ్వడానికి వచ్చిన ప్రతిపక్ష నాయకుల మోకాలు కనపడ్డాయా అని విరుచుకుపడ్డారు.వడగండ్ల వానల నష్టపరిహారం కలెక్టర్ ఖాతాలో పడ్డ తెల్లారే సమాచారం తెలుసుకున్న ప్రతిపక్ష నాయకులు కలెక్టర్ కు వినతిపత్రాలు ఇచ్చారు ఇదేనా వారి సంస్కారం అని నిలదీశారు. రాష్ట్రంలో వడగండ్ల. వానలకు నష్టపరిహారం 151 కోట్ల మంజూరి కాగా నర్సంపేటకు 42 కోట్లు వచ్చాయనీ కాగా నష్టపోయిన వారు 38 వేల 800 మంది రైతులుగా గుర్తించామని తెలిపారు. రోత రాజకీయాలు ఉచ్చిలిపాటు తనంతో ప్రతిపక్ష నాయకులు చేష్టలు ప్రజలు గమనిస్తున్నారని ,ఇప్పటి వరకు నర్సంపేటను ఏలిన ఇద్దరు నాయకులు మీ పాలనలో కనీసం 4 కోట్ల రూపాయల నిధులైనా తెచ్చారా అని ఎద్దేవా చేశారు. అన్ని పథకాలు మాయే అని శిలాఫలకాల వద్ద పోటోలు దిగుతున్నారు మీరు కేంద్రం నుండి సొంతంగా ఏమైనా నిధులు తెగలరా అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు రాయిడి రవీందర్ రెడ్డి,బీఅర్ఎస్ పార్టీ నాయకులు గుంటీ కిషన్,డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి,గంప రాజేశ్వర్ గౌడ్,దార్ల రమాదేవి,యువరాజు,మండల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు