రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా.. 

ఇదేనా రైతులకు ఇచ్చే గౌరవం. 

గాలి మోటర్ లో వచ్చి.. రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం. 

రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పతనం తప్పదు వైఎస్ షర్మిల. 

నల్లబెల్లి, నేటి ధాత్రి: రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అలాంటి రైతు కన్నీళ్లు పెట్టుకుంటే దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అరిష్టమని వైయస్సార్ పార్టీ

అధ్యక్షురాలు షర్మిల అన్నారు ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా నల్లబెల్లి మండలంలోని బోలోని పల్లి గ్రామం నుండి పాదయాత్ర కొనసాగి మండల కేంద్రానికి చేరుకుంది ఈ సందర్భంగా ఆమె ప్రజల ఉద్దేశించి మాట్లాడుతూ నల్లబెల్లి మండల దారి పొడవునా భారీ ఎత్తున ప్రజలు ఘన స్వాగతం పలికి ఎన్నో సమస్యలను చెపుతుంటే చాలా బాధాకరంగా ఉందని ఎంతోమంది ప్రాణ త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో మరో రజాకార్ల అఘాయిత్యాలు పెత్తం దారితనం కళ్ళకు కట్టినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిస్తూ పాలన చేస్తున్నారని అన్నారు మండలంలో గత పది నెలల కిందట అకాల వర్షాలకు 60 వేల ఎకరాల్లో పంట నష్టం జరగగా స్వయాన ముఖ్యమంత్రి పంటల నష్టపరిహాన పరిశీలనకు వస్తానని మాట ఇచ్చి తీరా సమయానికి గాలి మోటార్లలో మంత్రులు పంపించి కంటి తుడుపుగా రైతులను ఓదార్చి నష్టపరిహారాన్ని అందిస్తామని మాయమాటలు చెప్పి వెళ్లారు నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటివరకు ఒక్క ఎకరాకు కూడా పరిహారం ఇవ్వలేదని అలాంటప్పుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే మంత్రి పదవులు ఎందుకు ఉన్నట్లు . .? ఇదేనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే గౌరవం ఒడ్డు దాకా ఓడ మల్లప్ప…. ఒడ్డు దాటాక బోడ మల్లప్ప అనే సామెతను గుర్తుకు తెస్తున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఆమె ఎద్దేవ చేశారు దొరగారికి ఎన్నికలు వస్తేనే హామీలు గుర్తుకొస్తాయని ఎన్నికలు అయిపోయిన మరుక్షణం హామీలను ఆటకెక్కించి ఫామ్ హౌస్ కు పరిమితం అవుతారని మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని నాలుగు లక్షల కోట్ల అప్పులతో నింపారని కెసిఆర్ ఎనిమిదేళ్ల పాలనలో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేలకోట్ల రూపాయలు దోచుక తిన్నారు తెలంగాణ సంపద మొత్తం ఒక కేసీఆర్ ఇంట్లోకి పోయింది ఇప్పుడు మరొక్క కొత్త వేషం కట్టి (బిఆర్ ఎస్) బందిపోట్ల రాష్ట్ర సమితి పార్టీ పెట్టి రాష్ట్రాన్ని కాకుండా దేశాన్ని సైతం దోచుకునేందుకు దొంగ వేషం కట్టాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్ళముందే వేలకోట్ల కమిషన్ తింటుంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు నోరు మెదపకపోగా మొద్దు నిద్ర పోతున్నారు రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఇప్పటివరకు 20 వేల నోటిఫికేషన్ మాత్రమే వెలువడించారు మిగతా ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని నిరుద్యోగ యువకులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు దేవుడేరుగు కనీసం ప్రైవేటు ఉద్యోగ కల్పన లేదు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పి మోసం చేసిండు వైయస్సార్ ఉన్నప్పుడు పావలా వడ్డీకి మహిళలకు రుణాలు ఇచ్చారు కెసిఆర్ ఇచ్చిన ప్రతి హామీ పథకం ఒక మోసం గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తాడు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల బాగోగులు గుర్తించకుండా తన కుటుంబ ఆస్తులను పెంచుకోవడమే తన లక్ష్యంగా ఎంచుకున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇది గమనిస్తున్నారని త్వరలోనే కెసిఆర్ కు తగిన గుణపాఠం చెప్పి గద్దె దింపుతారని అన్నారు రానున్న ఎన్నికల్లో తమ వైయస్సార్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తే వైయస్సార్ అమలు చేసిన పథకాలకు జీవం పోసి ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేస్తానని,బెల్టు షాపులను మూసివేస్తానని ఉద్యోగాల భర్తీపై మొదటి సంతకం పెడతానని తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సుభిక్ష పరిపాలన చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతి కుమార్, మండల అధ్యక్షుడు ఓదెల రవి, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎస్కె కాజా బి నర్సంపేట మండల అధ్యక్షుడు కీసర రాంబాబు , దుగ్గొండి మండల అధ్యక్షుడు కట్టయ్య నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!