రామాయంపేట (మెదక్)నేటి ధాత్రి.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మెదక్ ప్రాంతం మినహా మిగతా ప్రాంతాలు ఎంతో కొంత అభివృద్ధి చెందుతున్నాయని, కానీ మన రామాయంపేట ప్రాంతం మట్టుకు ఏమాత్రం అభివృద్ధి చెందడం లేదని అందుకు మన స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారి నిర్లక్ష్యం అన్నారు. అందుకు చక్కటి ఉదాహరణగా నిన్నటి రోజున రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో డిగ్రీ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసుకున్నప్పటికీ రామాయంపేట లో మట్టుకు గత 40 సంవత్సరముల నుండి డిగ్రీ కళాశాల కొరకు ఎదురుచూస్తూనే ఉన్నారని రామాయంపేట ప్రాంత ప్రజలకు ఇప్పటికి కూడా ఈ ఎదురుచూపులే మిగిలాయని, అందుకు పూర్తిగా స్థానిక నాయకులే కారకులు అయ్యారని అన్నారు . అలాగే ఏ విధమైనటువంటి మౌలిక వసతులు లేవని వీటన్నింటిని ప్రజలు గుర్తుపెట్టుకున్నారని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఈ వసతుల ఏర్పాటులో నిర్లక్ష్యం వహించినందుకు పూర్తి రుణము ప్రజలు తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్నారని అన్నారు .. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.