రామయంపేటలో విచ్చలవిడిగా బ్లాస్టింగ్ లు..

రామయంపేటలో విచ్చలవిడిగా బ్లాస్టింగ్ లు

పట్టించుకోని సంబంధిత అధికారులు.
చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు.
అదే అదునుగా కొనసాగుతున్న బ్లాస్టింగ్ వ్యాపారం.
రామయంపేట (మెదక్)నేటి ధాత్రి.
రామయంపేట మున్సిపాలిటీ పరిధిలో బ్లాస్టింగ్ జోరుగా కొనసాగుతుంది. విషయంలో కొందరు ప్రజా ప్రతినిధులతో పాటు వ్యాపారులు తమ ఇష్టం వచ్చినట్లు దర్జాగా బ్లాస్టింగ్లు పెట్టి తమ వ్యాపారని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో ఎవరైనా ప్రశ్నిస్తే వారిని బెదిరింపులకు పాల్పడడంతో పాటు దాడులకు సైతం వెనకాడని పరిస్థితి నెలకొంది. గత రెండు మూడు రోజుల వ్యవధిలో రామయంపేట బైపాస్ రోడ్డు అక్కన్నపేట శివారులో ఓ వ్యక్తి దర్జాగా బ్లాస్టింగ్ పెట్టి రాళ్లను పెగి లించడం జరిగింది. ఈ విషయమై సదరు వ్యక్తిని వివరణ అడగగా తమకు అన్ని శాఖల అధికారుల అనుమతులు ఉన్నాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు మీ ఇష్టం వచ్చిన విధంగా చేసుకోండని విలేకరులను సైతం బెదిరించడం జరుగుతుంది. రామయంపేట పట్టణంలో గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ జోరుగా కొనసాగుతుండడంతో ఈ మధ్యకాలంలో రియల్టర్లు ఈ విధంగా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేయడంతో పాటు విచ్చలవిడిగా బ్లాస్టింగ్లకు పాల్పడడం జరుగుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

error: Content is protected !!