మంగపేట నేటి ధాత్రి
మంగపేట మండలం లక్ష్మీ నర్సాపురం పాఠశాల ప్రాంగణంలో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొమరం భీం జయంతి వేడుకలు ,పూల మాలలతో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది .. ప్రత్యేక ఆహ్వానితులు గా బాడిశ రామకృష్ణ పాల్గొని కొమరం భీం చిత్రపటానికి పూలమాల వేసారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్ మాట్లాడుతూ.. ఆదివాసులు హక్కుల పోరాట ఆరాధ్యులు , ఆదివాసి మనగడ కోసం అలుపెరగని యుద్ధం చేసిన గొండు బెబ్బులి కొమరం భీమ్.. చూపిన మార్గంలో మనం ఎప్పుడూ పయనించాలని..ఆ మహనీయుడి త్యాగం మనం ఎప్పటికీ మర్చిపోవద్దని ఆయన అన్నారు..ఈకార్యక్రమంలో జీవవైవిధ్య డైరెక్టర్ కర్రి శ్యాం బాబు,కొమరం ధనలక్ష్మి,గుంటపూడి తిరుమల, మదురిమ టీచర్ ,మాధవరావు, కొమరం ఈశ్వరమ్మ, మడకం రాజేశ్వరరావు,కారం సాంబయ్య, ట్రస్ట్ సభ్యులు..బాడిశ ఆది నారాయణ, ఇందారపు రమేష్,చౌలం సాయిబాబు,గట్టిపల్లి అర్జున్,కొమరం రవి,మునిగల మహేష్,బాడిశ నవీన్,జనపట్ల జయరాజు,చీర్ల రమేష్,ఒదేల సుధీర్,కనుకుంట్ల నాగరాజు,జై భీమ్ రామ్మోహన్, మహిళలు తదితరులు పాల్గొన్నారు..