వరంగల్ సిటి నేటిధాత్రి
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్ టీఆరెస్ కార్పొరేటర్ శారదా జోషి తన పదవికి రాజీనామా చేయటానికి సిద్ధం అయ్యారు ఇందుకు కారణం అధికారులు అని చెపుతున్నారు డివిజన్ లోని సమస్యలు అధికారులు పట్టించుకోవటం లేదని కనీసం సమస్య ఉందని చెప్పినా కానీ వారు పెడచెవిన పెడుతున్నారని గత కొన్ని రోజులనుండి డివిజన్ సమస్యలు పరిష్కరించాలని సంబంధిత కార్పొరేటర్ కార్యాలయానికి ప్రజలు వినతులు చేసినప్పటికీ స్పందించక పోవటం నిరాశకు గురైన కార్పొరేటర్ శారదా జోషి రాజీనామా కి సిద్ధం అయినట్టు తెలుస్తుంది గతం లో డివిజన్ సమస్యలు పరిష్కరించడం లో నిర్లక్ష్యం వహించిన అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బల్దియా ప్రధాన కార్యాలయంలో ధర్నా చేసిన విషయం తెలిసిందే అప్పటి నుండి ఇప్పటివరకు కూడా డివిజన్ లోని సమస్యలు పరిష్కరించటం లో నిర్లక్ష్యం చేస్తున్నట్టు ప్రజలు విమర్శిస్తున్నారని నిరాశ తో రాజీనామా కు సిద్ధం అయినట్టు తెలుస్తోంది బల్దియా ఉద్యోగులు ఇందుకు కారణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు