వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 ను పురస్కరించుకొని మంగళవారం నాడు కరీంనగర్ ప్రభుత్వ అందుల మరియు బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు జిల్లా పర్యటక శాఖ ఆధ్వర్యంలో విహాయాత్రను చేపట్టారు. అందులో భాగంగా 150 మంది అంద మరియు బధిర విద్యార్థులతో పాటు ఆశ్రమ పాఠశాల సిబ్బంది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శించుకున్నారు. అనంతరం దేవాలయం పక్షాన అన్న ప్రసాదం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ అధికారి ఆర్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము ఒక్కొక్క సందేశంతో నిర్వహించుకోవడం జరుగుతుందని, అదేవిధంగా ఈ సంవత్సరం “టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్” అనే అంశంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. నేటి విహారయాత్రలో మొదటగా ఎలగందుల కోటను సందర్శించి హెరిటేజ్ వాక్ ను నిర్వహించుకున్న అనంతరం దక్షిణ కాశీగా వెలుగొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా పర్యటక శాఖ అధికారి ఆర్. వెంకటేశ్వరరావుతో పాటు, రాష్ట్ర వారసత్వ శాఖ, సహాయ సంచాలకులు నాయిని సాగర్, జాతీయ యువజన అవార్డు గ్రహీత, సామాజిక కార్యకర్తలు ఏ. కిరణ్ కుమార్, గజ్జెల అశోక్, అందుల మరియు బధిరుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్స్ కే. నాగలక్ష్మి, భాస్కర్, 150 విద్యార్థులు పాల్గొన్నారు.
వారి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఉన్నారు.