భద్రాచలం నేటిదాత్రి
భద్రాచలం ముక్కోటి ఏకాదశి సందర్బంగా జరుగుతున్న అధ్యయనోత్సవాలలో భాగంగా దశావతారాలు అలంకరణలో రామచంద్ర మూర్తిని అలంకరణ చేసి ఉత్సవాల జరపడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఈరోజు
4వ రోజున నృసింహ అవతారం సందర్భంగా శ్రీ అహోబిల మఠం ప్రధాన అర్చకులు డా. కృష్ణ చైతన్య స్వామి ఆధ్వర్యంలో 108 మందితో కోలాట,డప్పు నృత్యాలతో స్వామివారికి లాంచనాలను అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య స్వామి మాట్లాడుతూ గత కొంతకాలంగా వైకుంఠ ఏకాదశి అధ్యాయనోత్సవాలలో భాగంగా రాములోరికి దశావతార అలంకరణ రోజుకో అవతారంగా రామచంద్ర మూర్తిని అలంకరణ చేస్తారని రోజుకో అవతారంతో భక్తులకు దర్శనం ఇస్తున్న రామచంద్ర మూర్తి నేడు 4వ రోజు నృసింహ అవతారం లో రామచంద్ర మూర్తి భక్తులకు కనువిందు చేస్తున్నాడని ఈ నృసింహ అవతారం రోజున లాంచనాలను అందజేయడం మా పూర్వజన్మ సుకృతమని అన్నారు.ఈ కార్యక్రమంలో అహోబిల మఠం ప్రధాన అర్చకులు డా.కృష్ణ చైతన్య స్వామి,వైధిక బృందం,నృసింహ భక్త కుటుంబ సభ్యులు , భక్తులు తదితరులు పాల్గొన్నారు.