ఆలోచించి ఆదరించండి
అభివృద్ధికి ఓటెయ్యండి
పింఛన్లు పెంచుతాం పథకాలు ఇంటింటికి చేరుస్తాము
ఎన్నికల ప్రచారంలోఎమ్మెల్యే వనమా
పూలు,హారతులు,కోలాటాలతో వనమాకు ఘన స్వాగతం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
పాల్వంచ టౌన్.రంగురంగుల వేషాలతో ముఖాలకు రంగేసుకుని మనసులో ఒకటి పెట్టుకొని ప్రజల్లోకి కొన్ని పార్టీలు రాబోతున్నాయని పార్టీల నాయకులు నియోజకవర్గంలోని గ్రామాలలో అడుగుపెట్టగానే ఏమి గ్రామాలకు వారు ఏం చేశారో అడుగుతూ నిలదీయాలని కొత్తగూడెం టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వనమా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా బుధవారం కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండలం లోని దంతల బోర,గంగాదేవి గుప్ప,బండ్రుగొండ, సంగం, దంతెల బోర ఎస్సీ కాలనీ, నారాయణరావుపేట, రేపల్లె, బోజ్య తండా, నాగారం తదితర ప్రాంతాల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాంతాల్లో జరిగిన సభల్లో వనమా మాట్లాడారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని ఇదేరా పార్టీల మాయ మాటలకు మోసపోవద్దని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని,చేస్తున్నానని, తాను జీవించి ఉన్నంతకాలం నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమన్నారు. ఆలోచించి తనను ఆదరించాలని అభివృద్ధికి ఓటేయాలని పిలుపునిచ్చారు. దంతల బోర చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గతంలో బూర్గంపాడు నియోజకవర్గంలో ఉండేవని అయినా ఇక్కడి గ్రామాల అభివృద్ధికి తానేంతో కృషి చేశాను అన్నారు. ఇక్కడి ప్రజలతో తనకు ఇక్కడి ప్రజలతో తనకు ఎంతో అవినాభా సంబంధాలు ఉన్నాయని తను సర్పంచిగా ఉన్న నాటి నుంచి ఇక్కడి ప్రజలతో మమేకమయ్యానన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం లో లేనప్పటికీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టి పెట్టుకొని ఆనాటి ముఖ్యమంత్రి తో మాట్లాడి రూ.12 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణాన్ని చేయించాను అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాకే ఇక్కడి ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందాయి అన్నారు. బి ఆర్ ఎస్ అభ్యర్థిగా తనను గెలిపించాలనికోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో తనకు ఎంతో స్నేహ సంబంధాలు ఉన్నాయని నియోజకవర్గ అభివృద్ధికి అది ఎంతగానో దోహదపడుతుందన్నారు. నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచిన అభివృద్ధి జరగదని ఒక వనమాతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు గ్రహించారని అన్నారు. ఎన్నికల్లో తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో తిరిగి మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రభుత్వం ఏర్పడగానే వృద్ధుల పింఛన్ ను 2000 నుంచి 3 వేలకు, వికలాంగుల పెన్షన్ 4000 నుంచి 5 వేలకు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు షాది ముబారక్, బీసీ బందు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంకా అనేక పథకాలను ప్రతి ఇంటికి చేరుస్తామన్నారు. అదేవిధంగా రూ పదివేలుగా ఉన్న రైతుబంధును 16 వేలకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. పోడు పట్టాలను సైతం ఇప్పించి పోడు రైతులకు భూమిపై హక్కు కల్పించిన ఘనత ఒక బి ఆర్ ఎస్ కె దక్కుతుందన్నారు. పొడుపు పట్టాలు రాణి మిగతా రైతులకు సైతం పోడు పట్టాలు ఇప్పిస్తామన్నారు.ప్రజలందరూ బాగుండాలని ఆ ప్రజల్లో నేను ఉండాలని ఆకాంక్షించారు వనమా. ప్రచారంలో భాగంగా తొలత ఆయా గ్రామాల్లోని పొలిమేరల్లో మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున వనమా పై పూలు చల్లుతూ హారతులు ఇస్తూ కోలాటాలు తప్పు వాయిద్యాలు నృత్యాల మధ్య ఘన స్వాగతం పలుకగా ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ, ఎంపిటిసిలు, సర్పంచులు, వార్డు సభ్యులు బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.