యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఉపాధి కల్పన శిక్షణ తరగతులు

యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్.పి. అమరవేణి ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారు ఒక వారం పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉపాధి కల్పన, శిక్షణా తరగతులు నిర్వహించారు. ఇందులో భాగంగా మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారు విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, రెస్యుమే రైటింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు త్వరలోనే మౌఖిక పరీక్షలు, రాత పరీక్షలు నిర్వహించి విప్రో, జెన్పాక్ట్, సదన్ ల్యాండ్, సోలేరో, టెక్ మహీంద్రా, గూగుల్, హెచ్ డి ఫ్ సి, జస్ట్ డయల్ మరియు ఇతర కార్పొరేట్ సంస్థలలో ఉపాధి కల్పించనున్నారు. శిక్షణ శిబిరం ముగిసిన సందర్భంగా వ్యాలిడిక్టరీ ప్రోగ్రాంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. అమరవేణి ప్రసంగిస్తూ విద్యార్థులు ఇలాంటి శిక్షణ తరగతులను ఉపయోగించుకొని తమ యొక్క ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ ను మెరుగుపరచుకోవాలని అన్నారు. ఇందులో శిక్షణ శిబిరం యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి డా.బి.రమా, శిక్షణా శిబిరం సమన్వయకర్తలు డాక్టర్.పి. కిరణ్ కుమార్, శ్రీ.ఎం.రాజేంద్రప్రసాద్ అధ్యాపకులు ,డా.కె.యకయ్య, శ్రీ. డి.రజినీ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

error: Content is protected !!