జెండావిస్కరించిన యూత్ అధ్యక్షుడు మచ్చ సుమన్
పరకాల నేటిధాత్రి(టౌన్)
టీపీసీసీ సభ్యులు,పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆదేశాల మేరకు పరకాల పట్టణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరకాల పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మచ్చ సుమన్ విచ్చేసి యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్ నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించరాని ఉపాధి లేకుండా చేశారని 2014 మరియు 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారన్నారు ఉద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానన్న మాట మార్చారన్నారు,యూత్ కాంగ్రెస్ కార్యకర్తల కష్టాలు ఎప్పుడు వృధా చేయనని,ఎప్పుడు అండగా ఉంటానని,యూత్ అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదని అన్నారు.అందరం కలిసి పరకాల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మార్గ కిరణ్ గౌడ్,నడికూడ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అప్పం కుమార్, ఇనగాల యువసేన పట్టణ అధ్యక్షులు బొచ్చు రాకేష్,శిర బోయిన కృష్ణ,కందుకూరి రాంప్రసాద్,బాసాని సుమన్,ఫిరోజ్ మీర్జా,చెంగల్ రావు,బొజ్జం అనిల్, మహమ్మద్ కాజా,బుస్సా ప్రవీణ్, అనిరుథ్ మరియు తదితరులు పాల్గొన్నారు.