వేములవాడ,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ పట్టణానికి చెందిన కొప్పుల లింగమూర్తి- పావని దంపతుల కుమార్తె కొప్పుల స్వాతి ఎస్సై ఉద్యోగానికి ఎంపికావడం అభినందనీయమని బీఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి కొనియాడారు. ఈ సందర్బంగా ఏనుగు మనోహర్ రెడ్డి శుక్రవారం కొప్పుల స్వాతిని శాలువాతో సన్మానించి, ప్రత్యేకంగా అభినందించారు. స్వాతి ఎస్సై ఉద్యోగంలో రాణించి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో
సర్పంచ్ చిలుక అంజిబాబు, సింగిల్ విండో చైర్మన్ కిషన్ రెడ్డి, కౌన్సిలర్ నరాల శేఖర్, నీలం శేఖర్, కూరగాయల శేఖర్, ఉడుతల రాము, మల్లేశం, అశోక్, తిరుపతి తదితరులు ఉన్నారు.
యువతికి బీఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి అభినందన
