వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న పరకాల శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు.
ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ గారి ప్రత్యేకమైన చొరవతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు.నూతనంగా నిర్మించిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. అనంతరం దేవాలయంలో స్వామి వారి ఊరేగింపులో పాల్గొన్నారు.