యాజమాన్యం కార్మికులకు వాస్తవాలు తెలియజేయాలి

మందమర్రి, నేటిధాత్రి:-

సింగరేణి యాజమాన్యం లాభాల వాటా, దసరా అడ్వాన్స్ చెల్లింపు, సింగరేణి వ్యాప్తంగా పండుగ వేడుకలు తదితర వంటి వాటిపై కార్మికుల్లో గందరగోళం నెలకొందని, అవి పట్టా పంచలు అయ్యేలా యాజమాన్యం కార్మికులు వాస్తవాలు తెలియజేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, లాభాలవాటా, దసరా అడ్వాన్స్ చెల్లింపులు నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ సింగరేణి యాజమాన్యానికి జారీ చేసిన ఉత్తర్వుల పత్రులను వెంటనే కార్మికుల ముందు పెట్టాలన్నారు. ఎందుకనగా రానున్న రోజుల్లో దీపావళి పండుగకు ముందు చెల్లించే పిఎల్ఆర్ బోనస్ ను సైతం చెల్లించవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని, అదేవిధంగా మిగతా ప్రభుత్వ ఉద్యోగుల చెల్లింపులు సైతం నిలిపివేసే అవకాశం ఉన్నందున వాస్తవాలు కార్మిక లోకానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికలు ప్రజల కష్టాలు తీర్చేవి కనుక ఎన్నికైన ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల సొమ్మును అసలు ముట్టుకోవు గనుక దసరా, దీపావళి పండుగలు నిర్వహించే యాజమాన్యానికి ఎన్నికల కోడ్ ఉన్నందున వాటి వల్ల సైతం సింగరేణి కార్మికులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని బతుకమ్మ ఆటలు నరకాసుర దహనం వంటి కార్యక్రమాలు సైతం అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. నేటి ఎన్నికలు కార్మికులకు కొత్త కొత్త ఇబ్బందులు తెచ్చుపెడుతున్నాయని, ఏనాడు కార్మికులకు ఇలాంటి అయోమయ పరిస్థితి ఎదుర్కోలేదని, దీంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సైతం తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు.అన్ని కార్మిక సంఘాలు యాజమాన్య నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న ఫలితం మాత్రం రావడం లేదన్నారు. ప్రస్తుత తరుణంలో దొరలెవరో దొంగలెవరో అర్థం కాని పరిస్థితి నెలకొందని, దీనికి కారకులు ఎవరో సింగరేణి కార్మికులకు చిరకాలం గుర్తిండి పోయాలా సమయం చూసి కార్మిక వర్గాన్ని దగా చేసే ప్రయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం వెంటనే దసరా అడ్వాన్స్, లాభాల వాటా, దీపావళి బోనస్ కార్మికుల ఖాతాలో జమ చేయాలని, అదేవిధంగా కాంట్రాక్టు కార్మికుల సైతం లాభాలు వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు పార్వతి రాజిరెడ్డి, టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి ఠాకూర్ మణి రామ్ సింగ్, టీజీఎల్బికేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి చాంద్ పాషా, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ నీరటి రాజన్న, రాష్ట్ర నాయకులు దేవి సత్యం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జైమిల్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు టి శ్రీనివాస్, నాయకులు ఎండి జాఫర్, పోషమల్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *