ములుగు జిల్లా నేటిధాత్రి
ములుగు జిల్లా కేంద్రంలో విద్యా శాఖ సమగ్ర శిక్షాలో ఒప్పంద ఉద్యోగుల రిలే ధర్నా, నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఉద్యోగులంతా మోకాళ్లపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చల్లా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులందర్నీ వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ములుగు జిల్లా సాధకులు ముంజాల బిక్షపతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాష్ట్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల ధర్నాలు కనపడట్లేదా, అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ వెంటనే సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని, ఆ లోపు కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 10 లక్షల జీవిత భీమా చెల్లించాలని, 5 లక్షల ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని మద్దతు తెలిపారు. అంతేగాక ములుగు జిల్లా బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు శనిగరపు నరేష్ పాల్గొని మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం సమగ్ర శిక్షా ఉద్యోగులందరికి సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని, తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే సమగ్ర శిక్షా ఉద్యోగుల భవిష్యత్ బాగు పడుతుందని వారి పూర్తి మద్దతు తెలిపారు. మైలా జయరాం రెడ్డి మంగపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తుడి భగవాన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి, అయ్యోరి జానయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, చెట్టిపల్లి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ మంగపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్, మరియు ములుగు జిల్లాలో పనిచేయుచున్న గెజిటెడ్ హెడ్మాస్టర్ ల అసోసియేషన్ నుండి తౌటం రమేష్, ఇనుగాల సూర్యనారాయణ, వజ్జ తిరుపతిలు పాల్గొని తమ పూర్తి మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఏపీఓ, సిస్టం అనలిస్టు, టెక్నికల్ పర్సన్, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, సీఆర్పీలు, కేజీబీవీ ఉద్యోగులు, పిటిఐలు, మెసెంజర్లు, తదితరులు పాల్గొన్నారు.