https://epaper.netidhatri.com/
`మైనంపల్లిపై వేటు కోసం వెయిటింగ్!
`మైనంపల్లిని పంపించేయాల్సిందే!
`తీసి అవతల పడేయాల్సిందే!
` మైనంపల్లి క్షమించ రాని తప్పు చేశాడు?` తప్పైందన్నా క్షమించొద్దు?
` మైనంపల్లి లాంటి వారు ఎప్పటికైనా మోసమే?
` తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాళ్లు వద్దే వద్దు?
`తిన్నింటి వాసాలు లెక్కించే వారిని కనికరించొద్దు?
`బిఆర్‌ఎస్ శ్రేణుల డిమాండ్.
` పార్టీ క్రమ శిక్షణా సంఘం ఏం చేస్తోంది?
`ఇప్పటి వరకు ఎందుకు స్పందన లేదు?
R`ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పిన తర్వాత జాప్యమెందుకు?
`అవకాశవాదులను ఉపేక్షించొద్దు!
`పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిపై వేటు పడాల్సిందే!
` తెలంగాణ వ్యాప్తంగా మైనంపల్లి దిష్టి బొమ్మలు దగ్థం!
హైదరబాద్,నేటిధాత్రి:
కుక్కకాటుకు చెప్పుదెబ్బ కొట్టాల్సిందే…మైనంపల్లి మీద వేటు వేటు వేయాల్సిందే అంటూ బిఆర్‌ఎస్ నాయకులు, కార్యక్తలు తెలంగాణ వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు. మైనం పల్లి హనుంతరావు ఆరోగ్యం బాగాలేని సమయంలో వెళ్లి పరామర్శించి, బాగోగులు వాకబు చేసిన మంత్రి హరీష్‌రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ శ్రేణులు ఖండిస్తున్నాయి. అసలు మైనం పల్లి మనిషే కళంకమంటూ బిఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాముకు పాలు పోసి పెంచినా విషమే చిమ్ముతుందని, ఇప్పుడు మైనంపల్లి కూడా చేసిందదే అని బిఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. ఎట్టిపరిస్ధితుల్లో మైనంపల్లిని ఉపేక్షించొద్దని పార్టీ అధిష్టానాన్ని, ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కోరుతున్నారు. మైనం పల్లి లాంటి వారు పార్టీలో వుంటే పార్టీకే చెడ్డపేరు వస్తుందని సూచిస్తుందన్నారు. ఇప్పటి వరకు పార్టీలో వుంటూ ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేసింది లేదు. తెలంగాణ ఉద్యమ ద్రోహి మంత్రి హరీష్‌రావు పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఒక వేళ సంజాయిషీ ఇస్తామన్నా స్వీకరించొద్దని కూడా కోరుతున్నారు. మైనం పల్లి అహంకారపూరితంగా చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ కూడా అవసరం లేదని పార్టీ నాయకులు అంటున్నారు. ఎట్టిపరిస్ధితుల్లో మైనంపల్లిపై ఎంత తొంరదగా వేటు వేస్తే అంత మంచిందంటున్నారు. రెండో రోజు కూడా మైనం పల్లి అవే తరహ వ్యాఖ్యలు చేశారు. పైగా మీడియాను కూడా దూషిస్తున్నాడు. తాను స్వయంగా ఎదిగిన నాయకుడినంటున్నాడు. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలుగుదేశం నుంచి రెండుసార్లు గెలిచానంటున్నారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాలతో రాజకీయాల్లోకి రాలేదని పరోక్షంగా ముఖ్యమంత్రి కేసిఆర్ కు ఉద్దేశించే మైనం పల్లి వ్యాఖ్యలు చేశాడు. తాను హైదరాబాద్ వెళ్లిన తర్వాత తనతోపాటు, మెదక్ సీటు తన కుమారుడికి ఇస్తేనే పోటీ చేస్తానంటున్నాడు. అయినా మైనంపల్లిపై వేటు వేయకపోతే, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది. అందుకే సోమవారం ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పినట్లు, పార్టీ లైన్ దాటిన వారిని తీసి అవతల పడేయాల్సిందే అంటూ బిఆర్‌ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే మైనం పల్లి క్షమింపరాని తప్పు చేశాడు. అది కూడా తెలిసో,తెలియకో చేసిన వ్యాఖ్యలు కాదు. పూర్తి సోయిలో వుండి చేసిన వ్యాఖ్యలే. పైగా ఒకసారి కాదు, రెండుసార్లు పార్టీపై మాట్లాడారు. తాను పార్టీపై మాట్లాడలేదంటూనే, రెండు సీట్లు ఇస్తేనే పోటీ చేస్తానని తెగేసి చెబుతున్నాడు. తెగేదాకా మైనంపల్లే లాగుతున్నాడు. ఇంకా వేచి చూసే దోరణి మైనంపల్లికి అవకాశమిచ్చినట్లై అవుతుంది. అయితే శిశుపాలిడిలా మైనం పల్లి తప్పులు లెక్కబెట్టుకుంటూ చూడొద్దని నాయకులు కోరుతున్నారు. ఏది ఏమైనా మైనం పల్లి లాంటి నాయకుడు ఎంత కాలం పార్టీలో వున్నా చీడపురుగే అంటున్నారు. పార్టీకి నష్టం చేకూర్చే వ్యక్తిగత స్వార్ధపరులను క్షమించొద్దని సూచిస్తున్నారు.
తిన్నింటి వాసాలు లెక్కిస్తున్న మైనంపల్లి హనుమంతరావు అహంకారమే తెలుగుదేశం పార్టీ నుంచి గెంటేసేదాకా తెచ్చుకున్నది.
అక్కడి నంచి కాంగ్రెస్‌కు వెళ్లి తన నైజం చూపించడంతో కనీసం టిక్కెట్‌కూడా ఇవ్వకుండా పార్టీ నుంచి గెంటేశారు. ఎక్కడా దిక్కులేక, రాజకీయ జీవితం ఆగమైపోయే పరిస్ధితి వచ్చిందని ముఖ్యమంత్రి కేసిఆర్ కాళ్లా వేళ్లా పడిన రోజులు మైనంపల్లి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి కేసిఆర్ బిఆర్‌ఎస్‌లోకి రమ్మని మైనంపల్లిని ఆహ్వానించలేదు. కాని ఇప్పుడు తాను ఎవరి వల్ల నాయకుడిని కాలేదంటూ మాట్లాడడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమే అవుతుంది. మైనంపల్లి ఇలాంటి నేతనే అని గమనించే ఆనాడు చంద్రబాబు తరిమేశాడు. గాంధీ భవన్ గేటు అవతలా దాకా తోసింది. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్ దయతల్చితే ఆఖరకు ఆయన మీదే మైనం పల్లి వ్యాఖ్యలు చేసేదాకా వచ్చింది.
మైనం పల్లి హనుమంతరావు రెండు రోజుల్లో రెండుసార్లు తప్పుడు మాటలు మాట్లాడాడు.
పైగా మంత్రి హరీష్‌రావుపై చేయకూడని వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు పార్టీ క్రమశిక్షణా సంఘం ఏం చేస్తున్నట్లు అని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా కాలయాపన చేయడం సరైంది కాదు. అసలు తెలంగాణ వీరుడైన మంత్రి హరీష్‌రావు పేరు కూడా పలికేందుకు అర్హత లేని వ్యక్తి మైనం పల్లి హనుమంతరావు. ఇప్పుడు తన కొడుకు గురించి గొప్పలు చెప్పుకుంటున్న మైనంపల్లికి అదే వయసులో మంత్రి హరీష్‌రావు తెలంగాణకోసం కొట్లాడాడన్న సోయి లేకుండా మాట్లాడడం క్షమించరానిది. అయినా సిద్దిపేట జిల్లాకు హరీష్‌రావుకు, మెదక్ జిల్లాతో ఏంపని మాట్లాడుతున్నాడు. మరి మైనంపల్లి మల్కాజిరిగిలో ఎందుకు పోటీ చేస్తున్నట్లు? గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన రామాయంపేటలోనే అప్పుడే ఇండిపెండెంట్‌గా పోటీ చేయలేదు. ఎందుకు బిఆర్‌ఎస్‌లో చేరినట్లు? ఉమ్మడి మెదక్ జిల్లాలనుంచి వేరుపడిరదే సిద్దిపేట జిల్లా. ఉమ్మడి జిల్లానుంచి వున్న ఏకైక మంత్రిగా హరీష్‌రావు అన్ని నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు పర్యవేక్షించాలి. అంతే కాదు మంత్రి అంటే ఒక నియోజకవర్గానికో, జిల్లాకో పరిమితయ్యే పదవి కాదు. తెలంగాణ రాష్ట్రానికి హరీష్‌రావు మంత్రి. ఆయనకు అన్ని ప్రాంతాలు సమానమే..! అలాంటప్పుడు మెదక్ మీద హరీష్‌రావు పెత్తనమేమిటన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. తెలివి లేని దద్దమ్మలాగా మైనంపల్లి వ్యాఖ్యలు చేసి, సమర్ధించుకోవడాన్ని ఎవరూ ఆహ్వానించరు.
మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిపేరున పలికేందుకు కూడా మైనంపల్లికి అర్హత లేదు.
ఒక మహిళా నాయకురాలిగా, ఉద్యమకారురాలిగా పద్నాలుగేళ్లపాటు తెలంగాణ సుధీర్ఘ పోరాటం చేశారు. తెలంగాణ కోసం నిరంతరం ప్రజల్లో వుంటూ, ఉద్యమానికి సహకరించారు. కేసులు ఎదుర్కొన్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నా, ఎన్నుకోకపోయినా మెదక్ ప్రజల కోసం అహర్నిషలు పాటు పడిన నేత పద్మా దేవేందర్‌రెడ్డి. ఆమె చేసిన ఉద్యమం, అంకితభావమున్న నాయకత్వం, ప్రజల ఆదరణతో తెలంగాణ వచ్చిన తర్వాత రెండుసార్లు గెలిచారు. అలాంటి ఎమ్మెల్యేను కాదని, మైనం పల్లి కొడుకు ఏంపొడిచొచ్చాడని టికెట్ ఇస్తారో? ఆయనే చెప్పాలి. తనకంటే గొప్ప నాయకుడు అని తన కొడుకును పొగుడుకుంటున్న మైనం పల్లి తాను తప్పుకొని మల్కాజిగిరి నుంచి టికెట్ ఇప్పించుకుంటే బాగుడేంది. కాని అహంకారం తలకెక్కి, తన గత రౌడీయిజం తాలూకు జ్ఞాపకాలు ముందు వేసుకున్నట్లున్నాడు. అందుకే అహం తలెకెక్కి మైనం పల్లి మాట్లాడుతున్నాడంటూ బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. తెలంగాణ ఉద్యమనాయకురాలు ముందు నిలబడే అర్హత కూడా మైనంపల్లికి లేదు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్ శ్రేణులు మైనంపల్లి మైలలు తీశారు.