మేం సుద్దపూసలం!? పదవులిస్తేనే కొనసాగుతాం

 

-ఎప్పుడూ పదవులు మాకే సొంతం?

-మేమడిగిన పదవులిస్తేనే వుంటం?

-లేకుంటే అప్రతిష్టపాలు చేస్తాం?

-లేనిపోనివి ప్రచారం చేస్తాం?

-గ్రూపులు కడతాం?

-కోవర్టు రాజకీయాలు చేస్తాం?

-అన్యాయం చేశారని చెబుతాం?

-తిన్నింటి వాసాలు లెక్కపెడతాం?

-అసమ్మతి నేతలందరిదీ ఒకటే దారి?

-ఇది వరకు జితేందర్‌ రెడ్డి?

-ఆ తర్వాత విశ్వేశ్వరరెడ్డి?

-ఇప్పుడు అదే దారిలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ?

-అసలు రహస్యం ఎందుకు చెప్పవు పొంగులేటి?

-పదవుల వంకతో అసలు ముచ్చటేమిటి?

-కరంటు మోటార్లకు మీటర్ల మతలబు ఏమిటి?

-ఆ కాంట్రాక్టు గుట్టేమిటి?

-బిజేపితో లోపాయి కారి ఒప్పందమేటి?

-కోవర్టు రాజకీయాల మాటేమిటి?

-అసలు సంగతి బైటపడితే పరిస్థితి ఏమిటి?

-లోగుట్టు మీటర్లకెరుక?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఎంచుకున్న దారిలో వెళ్లలేనప్పుడు, వున్నదారిలో వెళ్లలేని స్ధితిని తెచ్చుకున్నప్పుడు, ఏదారిలో వెళ్లాలో అర్ధం కాదు. గందరగొళాలు చుట్టు ముట్టినప్పుడు, చెప్పుడు మాటలు వినడం నేర్చుకున్నప్పుడు , చే జేతులా చెడగొట్టుకుంటున్నప్పుడు, కళ్లు మూసుకుపోయినప్పుడు, ఎంత వెలుగున్నా దారి కనిపించదు. అహం తెచ్చే చీకటికి ఏ దారి కనిపించదు. ఏ తోవలో వెళ్లాలో తోయదు. కూడలి మధ్య నిలబడినా అసలు దారి దొరకదు. సరిగ్గా ఇప్పుడు ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దారి కోసం ఎదురుచూస్తున్నాడు. వెళ్తున్న దారిలో తనకు తానే ముళ్లు పర్చుకొని కొత్త దారి కోసం ఆరాటపడుతున్నాడు. పక్కవారి మాటలు విని, అసలు దారినొదిలేశాడు. మొత్తం చీకటి పడితే గాని రహదారి విలువ అర్ధం కాదు. అర్ధం పర్ధం లేని మాట పట్టింపులకు పోయి, అనర్ధాలు కొని తెచ్చుకుంటున్నాడు. చెప్పే వారు ఎంతో మంది వుంటారు. కాని ఆదుకునే వారు ఎవరూ వుండరు. అవసరానికి ఒక్కరు కూడా చేతికందరు. బెల్లం వున్నప్పుడు ఈగలు వాలినట్లు, చెరువులో నీళ్లున్నప్పుడు కప్పలు చేరినట్లు కొంత కాలమే జనం పోగయ్యేది. కల చెదిరిన నాడు ఎవరూ మిగలరు. పలకరించేవారు కూడా కనిపించరు. ఇదే పొంగులేటి భవిష్యత్తు. 

 ఒక్కసారి రాజకీయాలకు అలవాటు పడిన తర్వాత పదవులు లేకుండా ఏ నాయకుడు వుండాలనుకోడు.

 కాని అనూహ్యంగా వచ్చిన పదవులు కూడా కొన్ని సార్లు కలలా వచ్చి చెదిరిపోతుంటాయి. మళ్లీ మంచి రోజులు వచ్చేదాకా ఎదురుచూస్తే తప్ప, రాజకీయాలు ఏలలేరు. గతంలో ఇలా ఎంతో మంది సీనియర్‌ నాయకులు ఎత్తుపల్లాలు చూసినప్పుడు కూడా ఒకేలా వుండడంతోనే ఇప్పటికీ వారి గురించి మాట్లాడుకుంటున్నాము. ఎత్తును చూసినప్పుడు ఎడిరిపడి, పల్లం చూసినప్పుడు ఓపిక లేని నేతలను ప్రజలే కాదు చరిత్ర కూడా మర్చిపోతుంది. అప్పుడు నేనున్నాని ఎంత మొత్తుకున్నా కాలం కనికరించదు. సమాజం గుర్తించదు. అలా ఉనికికి కోల్పోయిన నేతల్లో జితేందర్‌రెడ్డి ఒకరు. బిఆర్‌ఎస్‌లో వున్నంత కాలం లో వెలుగు వెలిగాడు. తెలంగాణ రాష్ట్ర సమితి( ఇప్పుడు భారత రాష్ట్ర సమితి) ఉద్యమ పార్టీ. ఉద్యమ నేతలందిరకీ అవకాశాలు రావాలి. వచ్చిన వారికే అవకాశాలు వస్తూ పోతే, ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలంటే కొన్ని దశాబాద్దాల కాలం పడుతుంది. అందుకే మొదటి సారి 2014 ఎన్నికల్లో అవకాశం కల్పించి, టిక్కెట్టు ఇచ్చి జితేందర్‌రెడ్డిని ఎంపిని చేసింది పార్టీ. అయితే ముందస్తు ఎన్నికలు ఎవరి లెక్కలేమిటో? ఎవరి పనితనం ఏమిటో? ఎవరు పార్టీ కోసం ఎంత పనిచేశారో తేల్చేశాయి. అందులో జితేందర్‌రెడ్డి కూడా వున్నారు. దాంతో ఆయనను ముఖ్యమంత్రి కేసిఆర్‌ పార్లమెంటు ఎన్నికల్లో టిక్కెట్‌ ఇవ్వలేదు. ఆ సమయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో జితేందర్‌రెడ్డికి తెలుసు. ముందస్తు ఎన్నికల్లో పార్టీకోసం పూర్తి స్ధాయిలో పనిచేయలేదని ఆయనకు తెలుసు. అయినా నేను శుద్దపూసని అని చెప్పుకుంటే సరిపోతుందా? పార్టీకి ఎవరు మేలు చేస్తున్నారు? ఎవరు ద్రోహం చేస్తున్నారు? అన్నది శ్రేణులకు తెలియకుండా వుంటుందా? పార్టీ అధిష్టానానికి సమాచారం చేరకుండా ఆగుతుందా? ముందస్తు ఎన్నికల సమయంలో కొన్ని సర్వే సంస్ధలు, ముఖ్యంగా ఆనాడు ఆంధ్రకు చెందని ఓ నాయకుడి సర్వేలను చాలా మంది ఫాలో అయ్యేవారు. ఆ సర్వేలో బిఆర్‌ఎస్‌ ప్రభావం లేదంటూ ఆయన చేసిన సర్వేలను నమ్మి, పార్టీకి నమ్మకం ద్రోహం చేసిన వారిలో జితేందర్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వున్నారు. నిజానికి ఈ ముగ్గురు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలనుకున్నారు. కాని ఆ సమయంలో ముందస్తుకు వెళ్లడంతో వారికి అవకాశం దక్కలేదు. పైగా తమకు టిక్కెట్లు ఇవ్వలేదన్న అక్కసును పెట్టుకొని, పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేశారు. ఇది ఇంటిజెన్స్‌ ద్వారా తేలిపోయింది. పార్టీ శ్రేణుల ద్వారా రుజువైంది. వారు అనుకున్నట్లు కాకుండా, ప్రజా తీర్పు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశించినట్లుగా వచ్చింది. తమ పాలన మీద తమకే నమ్మకం లేని నాయకులు వున్నా ఒకటే లేకున్నా ఒకటే అనుకొని ముఖ్యమంత్రి కేసిఆర్‌ వారిని పక్కన పెట్టారు. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాకపోతే టిక్కెట్లు ఇవ్వలేదు. దాంతో తామెంతో నిజాయితీ పరులమన్నట్లు జితేందర్‌రెడ్డి, విశ్వేశ్వరరెడ్డిలు రాత్రికి రాత్రి పార్టీలు మారారు. జితేందర్‌రెడ్డి తన బలాన్ని అతిగా ఊహించుకొని బిజేపిలో చేరి ఓడిపోయారు. విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నారు. అధికారంలో వున్నంత కాలం చేయాల్సినన్ని కాంట్రాక్టులు చేసుకున్నారు. సంపాదించాల్నింది సంపాదించుకున్నారు. కాని పార్టీకి మేలు చేయాలన్నది మర్చిపోయారు. మిషన్‌ భగీరధ కాంట్రాక్టులు బాగానే చేసుకున్న విశ్వేశ్వరరెడ్డి సబ్‌ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులు ఎగ్గొట్టి వారి జీవితాలతో ఆటలాడుకొని, తాను సచ్చీలుడినని చెప్పుకుంటాడు. ఆయన మూలంగా ఎంతో మంది సబ్‌ కాంట్రాక్టర్లు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం నుంచి మాత్రం విశ్వేశ్వరరెడ్డి బిల్లులు ఎత్తేసుకున్నాడు. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను తూర్పారపడుతున్నాడు. 

ఇక పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విషయంలో గత పార్లమెంటు ఎన్నికలలో టిక్కెట్టు ఇవ్వకున్నా, తాను చేసిన తప్పేంటో తెలిసి కొంత కాలం ఓపికపట్టారు.

 నిజానికి ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్‌కు సీట్లు రాకపోవడానికి ప్రధాన కారణం పొంగులేటి అన్నది అందరూ చెప్పే మాటే. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌గాని, మంత్రికేటిఆర్‌ గాని ఎంతో గౌరవంగానే చూసుకున్నారు. అయినా ఆయనలో మార్పురాలేదు. ఇటీవల కూడా ఆయనకు రాజ్యసభకు పంపిస్తామని చెప్పినా, భుజ్జగించినా ఆయన వినిపించుకోలేదు. అసమ్మతి వాదిగా వుండడనికే ఆయన ఇష్టపడ్డారు. అందుకు పైకి ఒక కారణం వుంటే, లోన మరో కారణం వుంది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాపారి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మోటర్లకు మీటర్లు అనే దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా? అన్నది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా అనేక సభల్లో చెబుతూ వచ్చారు. ఆఖరుకు అసెంబ్లీలో కూడా ప్రకటించారు. ఎట్టిపరిస్ధితుల్లోనూ మోటార్లకు మీటర్లుపెట్టే పరిస్ధితి లేదని తేల్చిచెప్పారు. కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా ముఖ్యమంత్రి తలగ్గలేదు. కాని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అక్కడి జగన్‌ ప్రభుత్వం మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నది. ఆ కాంట్రాక్టు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఇచ్చింది. ఇక తెలంగాణలో ఆ కాంట్రాక్టు కూడా తానకే రావాలని బిజేపితో సత్సంబంధాలు మొదలుపెట్టాడు. కాని తెలంగాణలో ఆ కాన్సెప్ట్‌నే ముఖ్యమంత్రి కేసిఆర్‌ వ్యతిరేకిస్తున్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడం ఇష్టం లేని సర్కారు కాంట్రాక్టు ప్రస్తావన లేకుండా చేసింది. ఇది పొంగులేటికి నచ్చలేదు. తెలంగాణలో సుమారు 25లక్షలకు పైగా పంపుసెట్లు వుంటాయి. తెలంగాణలోవున్న పంపుసెట్లలో ఆంధ్రప్రదేశ్‌లో కనీసం సగం కూడా వుండవు. అలాంటిది అక్కడ రూ.4వేల కోట్ల కాంట్రాక్టు దక్కింది. అదే తెలంగాణలో అమలు చేస్తే కనీసం పదివేల కోట్ల కాంట్రాక్టు అందుతుంది. లాభం కూడా వేలకోట్లలో వుంటుంది. ఇలాంటి అవకాశం వస్తుందనుకున్నప్పుడు పార్టీతో ఏం సంబంధం. అందుకే ఓ ఏడాది కాలంలో గిచ్చి కయ్యం పెట్టుకోవడం మొదలుపెట్టాడు. అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చాడు. అలిగినట్లు రాజకీయనటన ప్రదర్శిస్తూ వచ్చాడు. ఇక ఎన్నికల తరుణం దగ్గరపడుతోంది. బిఆర్‌ఎస్‌లోనే వుంటే మహా అయితే టిక్కెట్టు వస్తుంది? అంతే! కాని అదే బిజేపిలోకి వెళ్తే అంత పెద్ద కాంట్రాక్టు చేజిక్కుతుంది. ఇదీ అసలు మ్యాటర్‌! ఇప్పుడు శుద్దపూసలెవరో? రాష్ట్రానికి మేలు చేసేదెవరో? రాజకీయం మాటను రైతులకే నష్టం చేకూర్చాలని అనుకుంటున్నదెవరో? ప్రజలకు అర్ధమౌతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!