ముత్తారం :- నేటి ధాత్రి
మండల కేంద్రానికి చెందిన కే. సౌజన్య(36) సంవత్సరాలు గల మహిళ
బ్లడ్ ఇన్ఫెక్షన్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మెరుగైన వైద్యం కోసం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలంటూ సౌజన్య కుటుంబ సబ్యులు స్థానిక సర్పంచ్ తూటి రజిత రఫీ ని ఆశ్రయించగా అనారోగ్యానికి గురైన సౌజన్య పరిస్థితిని మాజీ మంత్రి,మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబుకు సర్పంచ్ రజిత రఫీ తెలుపగా వెంటనే స్పందించి సౌజన్య కి వైద్య ఖర్చులకు గాను (125000)లక్ష ఇరువైఐదు వేల రూపాయల ఎల్ఓసి చెక్కును మంజూరు చేయించి బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అందించడంతో బాధితురాలు సౌజన్య మరియు కుటుంబ సబ్యులు శ్రీధర్ బాబు సార్ మీ మేలు మరువం.. మీకు రుణపడి ఉంటాం.. అంటూ బాధిత కుటుంబము చేతులెత్తి మొక్కుతూ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నటువంటి సౌజన్య కుటుంబ సబ్యులు ముత్తారం సర్పంచ్ తూటి రజిత రఫీ, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సోదరుడు శీను బాబు,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధయక్షులు చొప్పరి సదానందం,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ లకు హృదయపూర్వకంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.