మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శ

వేములవాడ,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపెల్లి, ఎదురుగట్ల గ్రామాలలో ఇటీవల మరణించిన తుపాకుల రాములు, కొల్లూరి బక్కయ్య, ఐలవేణి నారాయణ కుటుంబాలను శుక్రవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబ సభ్యులకు ఏనుగు మనోహర్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట చెక్కపెల్లి గ్రామ ఉపసర్పంచ్ తలారి మంజుల-సురేష్, మండల రెడ్డి సంఘం నాయకులు రాఘవరెడ్డి, బొంగరపు రామేశ్వర్ రెడ్డి, నేరెళ్ళ నర్సయ్య, గీస ఎల్లయ్య, ఎడపెల్లి మహేష్, తలారి రవి, గోస్కుల వేణు, ఎడపెల్లి విష్ణు, కొమురయ్య, పొన్నం స్వామి తదితరులు ఉన్నారు.

error: Content is protected !!