మార్క రఘుపతిగౌడ్ బిఆర్ఎస్ నాయకులు
పరకాల నేటిధాత్రి(టౌన్) పరకాల పట్టణ ప్రజల హృదయాల్లో గులాబీ జెండా ఉంటుందని పరకాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని పరకాల బిఆర్ఎస్ నాయకులు మార్క రఘుపతి గౌడ్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరకాల పట్టణాన్ని గతంలో గెలిచినా నాయకులు ఎవ్వరు పట్టించుకున్న సందర్బం లేదని చల్లా ధర్మారెడ్డి కి ప్రజలు పట్టం కట్టినప్పటినుండి పట్టనాన్ని రేవన్యు డివిజన్ గా,నూతన మున్సిపల్ కార్యాలయాన్ని,నూతన 100పడకల ఆసుపత్రి ని, నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని,అంబేద్కర్ సర్కిల్ ను సుందరంగా తీర్చిదిద్దిన నాయకుడు ధర్మారెడ్డి అని అన్నారు.అభివృద్ధి ని చూస్తుకూడా అభివృద్ధి జరగలేదు అనడం సరికాదని, ప్రతిపక్షాలు అభివృద్ధి ని ఓర్వలేక విమర్శిస్తున్నారని అన్నారు.పరకాల గడ్డ చల్లా అడ్డా అని రాబోయే ఎన్నికల్లో అధిక మెజారిటీ తో ధర్మారెడ్డి ని గెలిపించి మరోసారి పరకాల లో గులాబీజెండా ఎగరావేస్తామని అన్నారు.