ముఖ్య అతిధులుగా జాతీయ చైర్మన్ డా. మహమ్మద్ యాసీన్.
రాష్ట్ర అధ్యక్షులు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి
ములుగు జిల్లా అధ్యక్షులు పాల్ తీయ రాజశేఖర్ నాయక్, రాష్ట్ర ఈసీ సభ్యులు చల్లూరి మహేందర్, అధ్యక్షతన జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో నేషనల్ చైర్మన్ డాక్టర్ మహమ్మద్ యాసిన్ మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఆదేశాల మేరకు ఈరోజు ములుగు జిల్లాలో మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చైర్మన్ డాక్టర్ మహమ్మద్ యాసీన్ గారు ఇందులో భాగంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగితే రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా న్యాస్థానాలలో న్యాయం పొందవచ్చునని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు మానవ హక్కుల పై అవగాహన కలిగి ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేకుండా ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం ములుగు ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా రామప్పను సందర్శించడం కూడా జరిగింది. ఇందులో ముఖ్య అతిథులుగా నేషనల్ చైర్మన్ డాక్టర్ యాసీన్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి గార్లు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామ్మూర్తి, రాష్ట్ర ప్రచార కార్యదర్శిలు వ్యాసారపు కర్ణాకర్, రమేష్ రెడ్డి, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి శనిగరపు ప్రవీణ్ మరియు తదితరుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.