నేటి ధాత్రి ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం ను మున్సిపాలిటీ విలీనం చేయవద్దని బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో పోతుగల్ గ్రామం నుండి ఉపాధి కూలీలు బిజెపి నాయకులు ర్యాలీ గా బయలుదేరి ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు మున్సిపల్ వద్దు గ్రామపంచాయతీ ముద్దంటు నినాదాలు చేశారు సందర్భంగా బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణ మాట్లాడుతూ పోతుగల్ గ్రామము మున్సిపాలిటీ చేస్తే గ్రామంలో అని ఉపాధి కూలీ ఎత్తిస్తారని గ్రామపంచాయతీ గానే ఉంటే ఉపాధి హామీ పథకం ద్వారా కూలీ దొరుకుతుందని మున్సిపాలిటీ వద్దని ప్రతిపాదనలు చేస్తే వాటిని విరమించుకోవాలని గతంలోనే మున్సిపల్ కోసం విలీన గ్రామాల నుండి గ్రామ పంచాయతీల తీర్మానం తీసుకున్నారు తెలిపారు ఎట్టి పరిస్థితుల్లోనే మున్సిపాలిటీగా గ్రామాన్ని చేయవద్దని గ్రామ పంచాయతీగా ఉండాలని డిమాండ్ చేశారు అనంతరం డిప్యూటీ తాసిల్దార్ సురేష్ కుమార్ కు ఉపాధి కూలీ మహిళలు బిజెపి నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కస్తూరి కార్తిక రెడ్డి పట్టణ అధ్యక్షులు మెంగని మహేందర్ వరి వెంకటేష్ మల్లారపు సంతోష్ రెడ్డి. కరెడ్ల మల్లారెడ్డి కుడుకల జనార్ధన్ కిట్టు మీసా శంకర్ .ఎల్లా గిరి. పద్మ ఉపాధి హామీ కూలీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు