ఈ నెల 25న అవిశ్వాసం పై ఓటింగ్ నిర్వహించనున్న అధికారులు
స్థానిక ఎమ్మెల్యేకు ఎక్స్-ఆఫీసియో మెంబర్ గా ఓటు హక్కు అవకాశం
సాధారణ సమావేశం నేపద్యంలో భారీగా బందోబస్తు
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సాదారణ సమావేశం నిర్వహించేందుకు అధికారులు సమయాత్తం కాగా.. అవిస్వాసం తీర్మాణం నేపద్యంలో కౌన్సిలర్లు రెండు గ్రూపులుగా విడిపోవడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోననే నేపద్యంలో పోలీస్ ఉన్నతాధికారులు మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు కొంత సమయం కోసం వేచి చూసినప్పడికి.. సమావేశానికి ఇరు వర్గాల కౌన్సిలర్లు ఎవరు హజరు కాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తూ మున్సిపల్ కమీషనర్ బిర్రు శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం జమ్మికుంట మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరిన ఛైర్మన్ తక్కళ్లపల్ల రాజేశ్వరరావు వర్గం జమ్మికుంటకు రాకుండ ఎమ్మెల్యేతో కరీంనగరకు వెళ్ళి… అక్కడే ఎమ్మెల్యేకు ఎక్స్-ఆఫీసియో మెంబర్ గా ఓటు హక్కు కల్పించిన తర్వాత మీడియాతో మాట్లాడి… అటునుండి ఆటే హైదరాబాదకు తిరిగి క్యాంపుకు వెళ్ళినట్లు సమాచారం. ఇరువర్గాల మధ్య పోటి ఉండడంతో ఒకరికోకరు నేనంటే నేననే కోణంలో ఎవరు కూడా తగ్గకుండా వారివారి శిభిరాలను నిర్వహిస్తుండడంతో పాటు.. ఇటివల ఇరువర్గాల మధ్య జరిగిన సంఘటన కూడా చోటుచేసుకుంది. ఈ నేపద్యంలో 25 తారీకు అంటే ఇంకా 20 రోజులు సమయం ఉండడంతో ఏ రోజు ఏం జరుగుతుందోననే చెప్పి పట్టణంలో దీని పై తీవ్ర స్థాయిలో చర్చించుకుంటున్నారు. జమ్మికుంట మున్సిపల్ పీఠం ఎవరిని వరించనుందోననే ఆసక్తి పట్టణ ప్రజల్లో నెలకొంది.