మర్రిగూడలో ఇంటింట ప్రచారం,నామాపురం,గుజ్జలలో ఆత్మీయ సమ్మేళనాలు
కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు ముందుకు రావలసిందిగా ఇతర పార్టీల నాయకులతో మంతనాలు జరిపిన రవిచంద్ర
మునుగోడు నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి ఘన విజయం
చేకూర్చేందుకు శనివారం విస్త్రత ప్రచారం నిర్వహించారు.మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం,చల్లా
హరిశంకర్,ఆకుల రజిత్ లతో కలిసి ఆత్మీయ సమ్మేళనాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మొదట గట్టుప్పల్ మండలం నామాపురంలో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనంలో వారంతా మాట్లాడి గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు.ఆ తర్వాత నామాపురంలో పలు వాడల్లో కాలినడకన తిరిగి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి గురించి వివరించారు.మర్రిగూడ మండల కేంద్రంలో ఎంపీ రవిచంద్ర,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గులాబీ శ్రేణులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.మర్రిగూడలో బీజేపీకి చెందిన,నారాయణపురం మండలం గుజ్జలో కాంగ్రెసు నాయకులలో మంతనాలు జరిపి రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసిన, చేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం గురించి ఎంపీ వివరించారు.గుజ్జ రామాలయంలో తెలంగాణను అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేసి జాతీయ పార్టీని నెలకొల్పిన కేసీఆర్ ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు.అటుతర్వాత మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనంలో వద్దిరాజు ప్రసంగిస్తూ మున్నూరుకాపులు,బిసిల ఉన్నతికి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు.ఎన్నికల ప్రచారంలో ఎంపీ వెంట మున్నూరుకాపు ప్రముఖులు విష్ణు జగతి, పర్వతం సతీష్,సత్తినేని శ్రీనివాస్,ఉప్పు సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టు ఆదినారాయణ,వాసాల వెంకటేష్, గుండ్లపల్లి శేషగిరిరావు,పాశం కిరణ్ తదితరులు ఉన్నారు.