ముఖ్తార్ పాష 3వ వర్ధంతి సభలను జయప్రదం చేయండి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
సెప్టెంబర్ 24-2020 నా కరోనాతో అమరుడైన సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ కె ముఖ్తార్ పాష 3వ వర్ధంతి సభను సెప్టెంబరు 24 నుండి‌ 30 వరకు జరపాలని సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఏరియా కమిటి పిలుపులో భాగంగా గోడ పత్రికలు గురువారం గుండాల మండల కేంద్రంలో అవిష్కారించారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు సబ్ డివిజన్ నాయకుడు బి రాంసింగ్ మాట్లాడుతూ
విద్యార్థి దశలోనే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) నాయకుడిగా పనిచేస్తూ వర్గ స్పృహ అలవర్చుకొని డిగ్రీ చదువు వదిలి కార్మిక వర్గంతో చేయి కలిపి భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) తో పెంకు కార్మికులను సంఘటితం చేస్తూ టైల్స్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎఫ్ టీడబ్ల్యూ ) ఏర్పాటులో కీలకపాత్ర పోషించాడు యాజమాన్యాలు తప్పుడు పద్ధతులు అనుసరిస్తే కన్నేర్ర చేసేవాడని, దోపిడీకి పూనుకుంటే కార్మికులను ఐక్యం చేసి అరికట్టే వాడని కార్మికుల వేతనాలు, హక్కులతో పాటు ఉత్పత్తి, ఉత్పాదకతపై స్పష్టమైన అవగాహన ఉండేదని లాభ,నష్టాల గురించి వివరిస్తూ యాజమాన్యాలను ఒప్పించడంలో దిట్ట అని పెంకు పరిశ్రమ సంక్షోభం గురించి ఆవేదన చెందేవాడని సమస్యల గురించి అధ్యయనం చేయడంలో దిట్ట అని పెంకు కార్మికులతో పాటు మోటారు, హమాలీ, కాంట్రాక్ట్, ఆటో, సినిమా, షాపు వర్కర్లలతో యూనియన్లు స్థాపించారని సింగరేణిలో ఐ ఎఫ్ టీ యు ప్రధాన యూనియన్ గా ఎదగడంలో తన కృషి ప్రధానమైనదని కార్మిక వర్గంలో తలలో నాలికల మెదిలాడని ఆలాంటి పాష ను స్మరించుకుంటూ సెప్టెంబర్ 24 నుండి 30 వరకు వర్ధంతి సభలకు ఏరియా కమిటీ పిలుపునిచారు అన్ని మండల కేంద్రాలలో జరిగే సభలో ప్రజలు అధిక సఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నట్లు వారు తెలిపారు
ఈ కార్యక్రమంలో నాయకులు పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు ఎ సాంబ, కోశాధికారి జె గణేష్, నాయకుడు ప్రణయ్, అనిల్ కార్మికులు వినోద్, సారయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!