మీరే కావాలి… మీరే రావాలి.
కొన్ని సార్లు రాజకీయాలలో అరుదైన సంఘటనలు ఎదురౌతుంటాయి…నాయకులను ఆశ్చర్య పరుస్తుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ నాయకుడికి పట్టలేని సంతోషాన్ని కల్గిస్తుంటాయి. ఇంత కాలం ప్రజల మనసుల్లో ఎంత గూడుకట్టుకొని వున్నానో అన్న ఆనందం ఆ నాయకుడికి జీవితాంతం
గుర్తుంటుంది. జ్ఞాపకమై జీవితం మరింత గొప్పగా కనిపిస్తుంది. అలాంటి ఘటన ఒకటి స్టేషను ఘన్ పూర్ లో జరిగింది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఆశ్చర్యపర్చింది. తనపై ప్రజలకు వున్న ఆప్యాయత మరో సారి తెలుసుకున్నట్లైంది
కాకపోతే కడియం శ్రీహరికి ప్రేమను ఎంత చూపించాలో…మాకు నాయకుడిగా మీరెందుకు రావడం లేదని నిలదీసినంత పని చేశారు…నువ్వే మా నాయకుడివి అని అక్కడున్న మహిళలు ముక్తకంఠంతో చెప్పేశారు…ఈ సారి ఎన్నికల సమయంలో మీకోసం రండి…మేం గుండెల్లో పెట్టుకొని గెలిపించుకుంటాం…మరెవరికో మాత్రం ప్రచారానికి వద్దు అనేశారు…మీరు గతంలో చేసిన అభివృద్ధి మాత్రమే ఇప్పటికీ కనిపిస్తోంది… మీరే మళ్లీ వస్తే మా కాలనీలు వెలుగుతాయన్నారు… నాయకుడిని చూస్తే ప్రజలకు సంతోషం కలగాలి. నాయకుడు ఎదురైతే స్వేచ్చగా మాట్లాడగలగాలి. ఎదురైన ప్రజలను చూసి నాయకుడు ఎలా చిరునవ్వుతో పలకరిస్తాడో, ప్రజలు కూడా అలాగే ఆహ్వానించే పరిస్థితులు నాయకుడే సృష్టించుకోవాలి. అందుకోసం ఎంతో శ్రమించాలి. ఎంతో సేవ చేయాలి. ఎంతగానో ప్రజలతో మమేకమై వుండాలి. వారి ఆపదలో అండగా నిలవాలి. వారి సంతోషంలో పాలు పంచుకోవాలి. అప్పుడు ఆ నాయకుడు ఎక్కడ కనిపించినా ప్రజలు ఆప్యాయత కనబర్చుతారు…అబ్బురపడతారు…అలాంటి అరుదైన సన్నివేశం అందరు నాయకులు కోరుకునేదే! కానీ అందరికీ సాధ్యమయ్యేది కాదు..