చెన్నారావుపేట-నేటిధాత్రి:
మండల కేంద్రంలో స్థానిక జిపి తరుపున ఉన్న ఒకే ఒక వాటర్ ప్లాంట్ కొసవాడలో ఉంది.గ్రామ ప్రజలే కాకుండా ఈర్యా తండా,రాజీవ్ నగర్ కాలనీ గ్రామ ప్రజలు ఈ ప్లాంట్ నుండే మినరల్ వాటర్ తీసుకెళ్తు ఉంటారు.5 రూపాయలకే గ్రామ ప్రజలకు 20 లీటర్ల సామర్థ్యం గల వాటర్ క్యాన్ కి మినరల్ వాటర్ అందించాలనే ఉద్దేశ్యంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఈ ప్లాంట్ ఏర్పాటు చేసింది.కానీ గత నెలరోజుల నుండి ఈ ప్లాంట్ పని చేయకపోవడంతో ప్రజలు నీళ్లకు ఇబ్బందులు పడుతున్నారు.నీళ్లు మినిరల్ కాకపోవడంతో కేవలం నీళ్లు మాత్రమే ప్లాంట్ నుండి వస్తుండడంతో ప్రైవేటు వాటర్ ప్లాంట్ నుండి 15 రూపాయలకు ఒక క్యాన్ చొప్పున నీళ్లు కొనుకుంటున్నారు.స్థానిక సర్పంచ్,అధికారులకు ఈ సమస్య గురించి విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోవడంతో గ్రామస్తులు,మహిళలు బుధవారం ఉదయం వాటర్ ప్లాంట్ ముందు ఆందోళనకు దిగారు.వానాకాలం ప్రారంభం అయినందున మినిరల్ కానీ నీళ్లు తాగితే దగ్గు,జలుబు వంటి వ్యాధులు వస్తున్నాయని కావున వెంటనే సర్పంచ్,అధికారులు స్పందించి మినిరల్ వాటర్ ప్లాంట్ ని బాగు చేయించి మమ్మల్ని రోగాల భారీనుండి కాపాడాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.ఈ ఆందోళన కార్యక్రమంలో మహిళ కాంగ్రేస్ మండల అధ్యక్షురాలు బండి పద్మ,వార్డు సభ్యులు బండి ఉపేందర్, టి.ఆర్.ఎస్.పార్టీ యువ నాయకుడు కంది కృష్ణ చైతన్య రెడ్డి,మాజీ ఎంపిటిసి మాదాసి కుమారస్వామి, అడుప అశోక్,మహిళలు,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.