ఎమ్మెల్యేకు ఆలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వినతి
వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న 235 మంది ఉద్యోగులు శుక్రవారం వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబును సంగీత నిలయంలో కలిసి మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. దీనికి ఎమ్మెల్యే స్పందించి మీ సమస్యను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కమీషనర్ అనిల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.