మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకే రాస్తారోకో

 

నేటి ధాత్రి, జైపూర్:

చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల కేంద్రము లో రాస్తా రోకో

BJP ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టి చట్టబద్ధత కల్పించాలి

సెప్టెంబర్ 18 నుండి 22 తేదీ వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జైపూర్ మండల కేంద్రము లోని రాస్తారోకో చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సుందిల్ల మల్లేష్ మాదిగ మాట్లాడుతు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెట్టిన మింటిగ్ కి బీజేపీ పెద్దలు మరియు కేంద్ర మంత్రులు అనేక సందర్భాల్లో SC వర్గీకరణ బిల్లు చేస్తామని మాట్లాడటం జరిగింది మరి నేటికి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్న మాట నిలుపుకోలేదని అన్నారు ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో బిజెపి నేతలను మాదిగ పల్లెల్లో తిరగనియం అని రానున్న ఎన్నికల్లో ఓటు తో బీజేపీ పార్టీ కి బుద్ది చెబుతామని తెలియజేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నావారు .

MRPS మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు జలంపెల్లి శ్రీనివాస్ మాదిగ
MSF జిల్లా ఇంఛార్జి చిప్పకూర్తి సతీష్ మాదిగ .మండల ఇంచార్జీ చిప్పకూర్తి శంకర్ మాదిగ.
జైపూర్ మండల అధ్యక్షులు రామగిరి రాము మాదిగ
ప్రధాన కార్యదర్శి నిట్టూరి ప్రశాంత్ మాదిగ.
MRPS జిల్లా నాయకులు నిట్టూరి జనార్ధన్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి తుంగపిండి లక్ష్యేణ్
గ్రామ అద్యక్షులు రామగిరి రాకేష్ మాదిగ నంబయ్య రాజయ్య కళ్యాణ్ రాజు నందు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!