
వినోద్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఉమ్మడి బాలానగర్ మండల ఇంచార్జ్ నరిగే యాదయ్య మాదిగ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం. జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అథితిగా ఎమ్మార్పిఎస్ జిల్లా కో కన్వీనర్ బచ్చళ్ళ వినోద్ మాదిగ హాజరై మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టి చట్ట బద్ధత కల్పించి, మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఈ నెల చివరి వారంలో ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ నేత్రుత్వంలో మాదిగల విశ్వరూప మహాసభను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆయొక్క మహాసభకు రాజాపూర్ మండలంలోని మాదిగ మరియు ఉపకులాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై జరిగే యుద్ధంలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ సీనియర్ నాయకులు పెరుమాళ్ళ జంగయ్య,మాజీ మండల అధ్యక్షులు పల్లె శేఖర్ మాదిగ,పల్లె తిరుపతయ్య. మాదిగ . యాదయ్య మాదిగ,మల్లేపల్లి కృష్ణయ్య,శ్యామ్ మాదిగ, లవ్లీ మాదిగ,రమేష్ మాదిగ, మాదిగ, సత్తయ్య మాదిగ,కావాలి శివకుమార్ మాదిగ.నరసింహ,బూర్గుల శేఖర్, బాలరాజ్ మాదిగ,హన్మగాళ్ల రాము మాదిగ తదితరులు పాల్గొన్నారు.