`మంత్రి కేటిఆర్ కు 51 మంది వేడుకోలు.
` గతంలోనే కేటిఆర్ హామీ.
`కొందరు నేతలతో జాప్యం.
`ఆరేళ్లుగా ఎదురుచూపులు.
`ఆకలి, పస్తులతో కాలం గడుపుతున్నాం.
`వరంగల్ కమీషనర్ ఖాళీలున్నాయ్?…ఇస్తామంటున్నారు!
`కనికరించండి…కాపాడండి…కొలువులియ్యండి.
`మా బతులుల్లో వెలుగులు నింపండి.
`బుక్కెడు కోసం అలమటిస్తున్నాం…ఆదుకోండి.
`ప్లీజ్… మీరే దిక్కు!
`మా ఆవేదన ఆలకించండి.
`మాకొక దారి చూపండి.
హైదరాబాద్,నేటిధాత్రి:
కొలువులు కోల్పోయి ఏడేళ్లవుతోంది. ఇప్పుడూ, అప్పుడూ అంటూ ఆశలతో బతుకులీడుస్తున్నారు. కేవలం ఒకే ఒక్క మాటతో చిగురించిన ఆశలలో కాలం గడుపుతున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ మాట ఇచ్చాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆల్ మోస్ట్ ముఖ్యమంత్రి కేసిఆర్ మాట ఇచ్చినట్టే అన్న నమ్మకంతో మళ్లీ కొలువులు వస్తాయని ఎదురుచూస్తున్నారు. ఎక్కడో సమాచార లోపం తప్ప, ఇక్కడ ఇటు ఉద్యోగుల కోరిక నెరవేడరం లేదు. వాళ్లు ఉమ్మడి రాష్ట్రంలో గృహనిర్మాణ శాఖలో పనిచేసిన చిన్న ఉద్యోగులు. అప్పట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన పనిలో నిమగ్నమై పనిచేశారు. కాకపోతే అప్పట్లో ఆశాఖలో జరిగిన తప్పులకు ఈ చిన్న ఉద్యోగులు బలయ్యారు. ఆ శాఖలో అవినీతికి తెరలేపిన వాళ్లు మాత్రం బాగానే వున్నారు. దాంతో తెలంగాణ వచ్చిన తర్వాత ఆ శాఖను ప్రభుత్వం తొలగించింది. దాంతో ఈ ఉద్యోగులు వీధిన పడ్డారు. అయితే మన ప్రభుత్వం ఎలాగైనా తమకు ఏదో ఒక దారి చూపుతుందన్న నమ్మకంతో ఇంత కాలం ఎదురుచూస్తూనే వున్నారు. పడిగాపులు కాస్తూనే వున్నారు. ఎప్పుడెప్పుడు అప్పాయింట్ మెంటు లెటర్లు వస్తాయా అని కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు.
నిజానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసిన ఈ ఉద్యోగులను తీసుకుంటామని వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ గతంలోనే తీర్మాణం చేసింది..
ఒకసారి కాదు. రెండుసార్లు కూడా తీర్మాణాలు చేయడం జరిగింది. అదే సమయంలో ఓసారి ఖమ్మం పర్యటనలో, మరోసారి వరంగల్ పర్యటనలో మంత్రి కేటిఆర్ ఈ ఉద్యోగులకు మాట ఇచ్చారు. తప్పకుండా న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అందుకు వరంగల్ జిల్లా అధికారులకు కూడా సూచన చేశారు. మీ భరోసాతో మాట ఇస్తున్నాను. వీళ్లకు న్యాయం చేయండి. అని మంత్రి కేటిఆర్ ఒకటికి రెండుసార్లు చెప్పారు. అప్పటి నుంచి వీరి ఆశలు మరింత పదిలమయ్యాయి. మంత్రి కేటిఆర్ మీద నమ్మకంతో రోజూ ఎదురుచూస్తూనే వున్నారు. ఇప్పటికీ ఆ ఉద్యోగులను తీసుకునేందుకు వరంగల్ జిల్లా నగరపాలక సంస్ధలో అవకాశం వుందని, ఖాళీలున్నట్లు కూడా సమాచారం. ఇదే విషయం కూడా పాలక వర్గం సుముఖంగానేవున్నట్లు కూడా తెలుస్తోంది. ఒక్కసారి మంత్రి కేటిఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే చాలు అప్పాయింటు మెంటు లెటర్లు ఇచ్చేందుకు అధికారులు సిద్దంగా వున్నట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో మంత్రి కేటిఆర్ చెప్పినప్పుడే వీరికి ఉద్యోగాలు రావాల్సివుంది. కాని కొందరు నాయకులకు చేసిన చిన్న చిన్న పొరపాట్లు వారి జీవితాలకు శాపాలుగా మారాయి. అయినా మంచి రోజు కోసం వారు ఎదరుచూస్తున్నారు. అంతే కాదు తెలంగాణ ఉద్యమానికి ఆనాడు పూర్తి మద్దతిచ్చినవాళ్లు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని నమ్మిన వాళ్లు. ప్రతిపక్షాలు వీళ్లతో రాజకీయం చేయాలిన చూసినా వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నా వాళ్లు. అయితే వీళ్లును రాజీకయంగా ఉపయోగించుకొని, ప్రభుత్వం మీద లేని పోని ఆరోపణలు చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేశాయి. ఎందుకంటే వీళ్లు గతంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో క్రియాశీలకపాత్ర పోషించారు. దాంతో సమాజంలో వారితో వీరికి పరిచయాలు బాగానే వున్నాయి. రాజకీయంగా వీరిని ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు ఇప్పటికీ చూస్తున్నాయి. కాని వారు తమ జీవితాలను ఫణంగా పెట్టి ప్రభుత్వానికి తలనొప్పులు తేవొద్దన్న సదుద్దేశంతో ఇంత కాలం ఎదురుచూస్తున్నారు. వీరికి ఓ దారి చూపిస్తామని చెప్పిన మంత్రి దృష్టికి వీరి సమస్యలు నాయకులు తీసుకెళ్లకపోండంతోనే ఇంత కాలం జాప్యం జరిగింది. దయచేసి మాకు న్యాయం చేయండి. మాకు ఇస్తామన్న కొలువులు ఇవ్వండి. మా జీవితాలను నిలబెట్టండి అని వారు కోరుతున్నారు.