
వేములవాడ రాజన్న సన్నిధిలో మరో ఆణిముత్యం
వేములవాడ నేటి దాత్రి
వేములవాడ పట్టణానికి చెందిన కోప్పుల పావని లింగమూర్తి దంపతుల కూతురు కుమారి స్వాతి ఎస్సై పోస్టుకు ఎంపికైన సందర్భంగా ఇట్టి అమ్మాయికి మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మంగళవారం రోజున అన్నదాన సమయంలో ట్రస్టు సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి మెమెంటో అందజేశారు.
సన్మాన గ్రహీత కుమారి కొప్పుల స్వాతి మాట్లాడుతూ నేను ఎస్.ఐ పోస్టుకు సెలక్ట్ కావడానికి నాకు వెన్నంటిఉండి నన్ను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు కృతజ్ఞతలు అన్నారు. నన్ను మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు ద్వారా సన్మానించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
ట్రస్టు సభ్యులు డాక్టర్. రవీందర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి అని మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఎన్నో ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు సంపాదించి వేములవాడ పేరును రాష్ట్రములో మొదటి స్థానంలో ఉంచాలని అంతేకాకుండా భవిష్యత్తులో కుమారి స్వాతి ఇంకా ఎన్నో ఉన్నత పదోన్నతులు అధిరోహించి ఎక్కడ ఉన్నా వేములవాడ పేరు నిలబెట్టాలని అమ్మాయిని మనమంతా మనస్ఫూర్తిగా దీవిద్దాం అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్, డాక్టర్ బెజ్జంకి రవీందర్, నగుబోతు రవీందర్, ప్రతాప నటరాజు, పొలాస రాజేందర్, జూలపల్లి రాజు, నక్క వేణు, నాగుల చంద్రశేఖర్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, నంది సాయికుమార్ మరియూ కొప్పుల వారి కుటుంబ సభ్యులు కొప్పుల లింగమూర్తి, పావని, కృష్ణమూర్తి, ఉమ, గణేష్, గీత, శ్రీనివాస్, లత తదితరులు పాల్గొన్నారు.