ఏ,ఈ, రాజేందర్ రెడ్డి లీలలు.
ఏ ఈ రాజేందర్ రెడ్డి వద్దే అందరి చిట్టా, సంవత్సరాలుగా మేపుతున్న నాకు ఏమీ కాదు,!
రోజు కు ఒకటి తెరపైకి అవినీతి భాగవతం.
ఈ ఈ, ఎస్ ఈ లు పాత్రధారులు కాగా,ఈ ఎన్ సి కమిషన్కు కక్కుర్తి పడి నో యాక్షన్,!?
మహాదేవపూర్ కుంభకోణంపై బాధ్యత వహించేది ఎవరు,!?
అవినీతి లో కూడుకపోయి ఉన్న పనులను సాక్షాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్న ఇన్చార్జి ఏ ఈ పై చర్యలు తీసుకొని ఇతర ఏ ఈయనకి బాధ్యతలు అప్పగించాలి.
మహాదేవపూర్-నేటిధాత్రి:-
పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో మండలంలో అభివృద్ధి పనుల పేరిట కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడుతూ మండలంలోని పంచాయతీరాజ్ శాఖ నిధుల దుర్వినియోగానికి ఒక అడ్డగా మారి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ జీబుల్లోకి మళ్లించుకోవడం జరిగింది.
నిధుల దుర్వినియోగ వ్యవహారంలో ఇప్పటికే 97 రోజుల నుండి 20వేల నుండి రెండున్నర లక్షల రూపాయల వరకు కమిషన్ పేరుతో బాధితులకు పీడించడం జరిగిందని బాధితులు మీడియా ముందుకు రావడం జరిగింది మరోపక్క తాజాగా పని చేపట్టకుండానే 1,38,000 బిల్లును రికార్డ్ చేయడం వాటికి సంబంధించిన చెక్కును విత్ డ్రా చేసుకొని నిధులను తీసుకోవడం జరిగింది. ఇక నాసిరక పనులకు సంబంధించి మండలంలో ఇప్పటికే వందల నాసిరకం పనులు చేపట్టి ఉన్నాయని సాక్షాలు సైతం ప్రజల ముందుకు పెట్టడం జరిగింది ఇక సాక్షాలు తారుమారు చేసే క్రమంలో మూడు నెలలుగా ఆగి ఉండి శిథిల అవస్థకు వచ్చిన పనులు పలు రహదారులు కాంకేర లేకుండానే ఉన్నప్పటికీ వాటిపై పాల్ తీన్మార్చి నిధుల దుర్వినియోగానికి సాక్షాలు ఉండకూడదని గుట్టు చప్పుడు కాకుండా పనులను సాగించడం జరుగుతుంది. గా ఏ ఈ రాజేందర్ రెడ్డి కుంభకోణంలో పాత్రధారుని తను ఒక్కడే కాదని ఉన్నత అధికారుల కు సైతం వీళ్ళ తరబడి పోషిస్తున్నానని తనకు ఏమీ కాదని బినామీలతో చెప్పుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
*మహాదేవపూర్ పంచాయతీరాజ్ శాఖ అవినీతికి అడ్డా.!?*
ప్రభుత్వ నిధులు దుర్వినియోగంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలోని మండలాల్లో అవినీతికి అడ్డా అంటే మహదేవ్పూర్ పంచాయతీరాజ్ శాఖ అని కోట్ల కుంభకోణం వ్యవహారాన్ని శ్రీకారం చుట్టిన అధికారి రాజేందర్ రెడ్డి పై నేటి వరకు చర్యలు తీసుకోలేదంటే అవినీతి సొమ్ములు ఇప్పటికీ ఏరులై పారేలా చేయడం జరిగిందని చెప్పవచ్చు. పంచాయతీరాజ్ శాఖ అవినీతి విషయానికొస్తే మండలంలో ఇప్పటివరకు ఏ ఈ ఆధ్వర్యంలో చేపట్టిన రహదారుల నిర్మాణాలు సెంట్రల్ లైట్ డ్రైనేజ్ నూతన భవనాలు భవనాల మరమ్మతు ఇలాంటి పనులకు సంబంధించి ఏ ఈ రాజేందర్ రెడ్డి తన బినామీ కాంట్రాక్టర్లకు మాత్రమే పెద్ద మొత్తంలో పనులు అందించడం జరిగింది. విధాబీల ద్వారా లక్షల రూపాయల కమిషన్ కొరకు పలు రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో మండలానికి వచ్చిన బినామీ కాంట్రాక్టర్లు పదుల సంఖ్యలో పనులు చేపట్టుకోవడం కేవలం ఇతర చిన్న కాంట్రాక్టర్లు అందించని కమిషన్ను పది పర్సెంట్ మోతాదులో అందించడం అందుకే బినామీ కాంట్రాక్టర్లకు పనులు కేటాయించడం జరిగింది. అలాగే మరో పక్క బినామీల పేరుతో అమాయక కాంట్రాక్టర్లకు ఇబ్బందులకు గురి చేస్తూ ఏ ఈ రాజేందర్ రెడ్డి పెట్టుబడి పెట్టి బినామీల పేరుతో వందల పనులను ఇప్పటికే పూర్తి చేయడం వాటికి సంబంధించిన బిల్లులను కూడా తీసుకోవడం జరిగింది. తాజాగా ఎక్కువ కమిషన్ వస్తుందని యావత్ మండలంలో అవసరం లేనప్పటికీ 500 సెంట్రల్ లైట్లు 65 వేల రూపాయల కమిషన్ తీసుకొని విచ్చలవిడిగా బిల్లులను రికార్డు చేయడం జరిగింది. ఇలా పంచాయతీరాజ్ పరిధిలోని అభివృద్ధి పనులకు సంబంధించి ఏ ఈ రాజేందర్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల్లో సుమారు 80 కోట్ల కోట్ల నిధులను అభివృద్ధి పనులు పేరిట కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడడం జరిగింది.
*ఏ ఈ రాజేందర్ రెడ్డి వద్దే అందరి చిట్టా, సంవత్సరాలుగా మేపుతున్న నాకు ఏమీ కాదు,!*
మండలంలో భారీ కోట్ల కుంభకోణ వ్యవహారంలో నేడు సెలవులు ఉన్నప్పటికీ తన అధికారం తన అరాచకాన్ని మాత్రం వీడే ప్రసక్తి లేదంటూ మరింత రెచ్చిపోయి వాస్తవాలను బినామీ లకు చెప్పడం సన్ మండలమంతా సంచలనాన్ని సృష్టిస్తుంది. నేడు మండలంలో ఏ ఈ రాజేందర్ రెడ్డి కుంభకోణ వ్యవహారంపై సత్వర చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఏఈ రాజేందర్ రెడ్డి విధాబీలకు చెప్పుకుంటున్న వాస్తవాలను విని ప్రజల్లో పంచాయతీరాజ్ శాఖ తో పాటు జిల్లా మరియు ఉన్నత అధికారులపై విరక్తిని కలిగించే విధంగా ఏ ఈ చెప్పుకున్న మాటలు ఉన్నాయి. పలు వినమీలకు రాజేందర్ రెడ్డి తను మండలంలో నాలుగున్నర సంవత్సరాలుగా కమిషన్ వ్యవహారం కాంట్రాక్టర్ లతో చేపట్టిన పనులకు సంబంధించి వచ్చిన లక్షల రూపాయలను తను ఒక్కడే తీసుకోలేదని మండలంలోని అధికారులతో పాటు ఉన్నత అధికారుల వరకు పంపించడం జరిగిందని చెప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇంతే కాకుండా ఇప్పటికీ తను నిధుల దుర్వినియోగం లో చేసిన పనులకు సంబంధించిన డబ్బులను నాలుగున్నర సంవత్సరాల నుండి ఉన్నత అధికారుల వరకు పోషించుతున్నానని తనపై చర్యలకు అధికారులు ఆదేశిస్తే నాతో పాటు వారు కూడా దోషులు గాని నిలుస్తారని బినామీలకు చెప్పడం జరిగిందని మండలమంతా చర్చించుకుంటున్నారు. అలాగే రాజేందర్ రెడ్డి బినామీలకు మరింత భరోసాను కల్పిస్తూ మీరెవరు తొందర పడాల్సిన అవసరం లేదని నాపై ఏ అధికారి కూడా షరియకు ఆదేశించాడని మీరు చూస్తున్నారు కదా మూడు నెలలుగా నాపై వరుస కథనాలు వచ్చినప్పటికీ నాకు ఏ అధికారి కూడా విచారణకు ఆదేశించలేదని దీన్నిబట్టి చూస్తే మీకు అర్థమవుతుందని భరోసా కలిగించడం జరుగుతుందని చెప్పుకోవడం జరుగుతుంది. ఏ ఈ మాటలను బట్టి చూస్తే అతను బినామీలకు చెప్పింది వాస్తవాలేనని డి ఈ నుండి ఈ ఎన్ సి వరకు కుంభకోణానికి సంబంధించిన లక్షల రూపాయలను ఏఈ దుర్వినియోగానికి పాల్పడుతూ వారికి అందజేయడం జరిగిందని అందుకే ఏ అధికారి కూడా రాజేందర్ రెడ్డి పై నీటి వరకు చర్యలు తీసుకునే విధంగా అడుగు వేయలేదని చెప్పుటకు సందేహ పడాల్సిన అవసరం లేదు.
*రోజు కు ఒకటి తెరపైకి అవినీతి భాగవతం.*
ఎన్ని సాక్షాలు పంచాయతీరాజ్కు అవసరం ఎప్పుడు రాజేందర్ రెడ్డి తో పాటు ఇతర అధికారులపై చర్యలు తీసుకుంటారు గత మూడు నెలలుగా బాధితులు సాక్షాలతో తెరపైకి రావడం వందల సంఖ్యలో నాసిరకం పనులు బయట పెట్టడం గత నెలలో తాజాగా ఒక బాధితుడు రెండు లక్షల 50 వేల రూపాయల కమిషన్ను తన బిల్లులను రికార్డు చేయుటకు అందించాలని చెప్పడం జరిగినప్పటికీ పంచాయతీరాజ్ ఉన్నత అధికారి ఈ ఎన్ సి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరిగింది. రోజులు గడవక ముందే పేదల సొమ్ము ప్రభుత్వం మండల అభివృద్ధి కొరకు తన వంతు పాత్రను అభివృద్ధి కొరకు కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తే అభివృద్ధి పనుల పేరుతో ఏ ఈ రాజేందర్ రెడ్డి పంచాయతీరాజ్ ఉన్నత అధికారులకు ఇటు ప్రజా ప్రతినిధులకు కొమ్ము కాస్తూ కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగానికి పాల్పడడం జరిగినప్పటికీ చర్యలు తీసుకోకుండా అధికారులు రాజేందర్ రెడ్డి కి కొమ్ముకాస్తూ ఉండడం జరుగుతుంది. పంచాయతీరాజ్ అధికారులకు ఎన్ని సాక్షాలు కావాలో రాజేందర్ రెడ్డి కుంభకోణ విషయంలో వారానికి ఒక సంఘటన తెరపైకి రావడం పంచాయతీరాజ్ కనీస విచారణకు కూడా ఆదేశించకపోవడం గమనార్థం. మండలంలోని సూరారం గ్రామంలో ఎస్సీ కాలనీ నుండి మురికి మరియు వర్షపు నీరును గ్రామంలోని చెరువులోకి పంపించుటకు ఆరు పైప్ లైన్ లను అమర్చి పనిని గత సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. నాలుగు పైప్ లైన్లను అమర్చించాల్సి ఉండగా కేవలం 3 లైన్లను మాత్రమే అమర్చి నాలుగవ లైన్ అమర్చకుండానే పని పూర్తి చేసినట్లు రికార్డులు నమోదు చేసి లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలను దండుకోవడం జరిగింది. పనిచేయకుండానే ఏ ఈ రాజేందర్ రెడ్డి బిల్లును రికార్డు చేయడం వాటికి సంబంధించిన డబ్బులను తీసుకోవడం జరిగింది. గ్రామస్తులు ఏఈ అక్రమాలపై మూడు నెలలుగా వరుస కథనాలకు వారిలో మార్పులు తీసుకువచ్చిందని పంచాయతీరాజ్ శాఖ నిర్లక్ష్యం వహించడంతోనే తమ సొమ్మును తామే కాపాడుకుంటాం అన్నట్టుగా పంచాయతీరాజ్ అవినీతి తిమింగళం చేసిన అక్రమాలను ఇక తామే బట్టబయలు చేస్తామని మండల ప్రజల్లో సంకల్పంగా తీసుకోవడం జరిగిందని చెప్పవచ్చు. పంచాయతీరాజ్ అవినీతికి బట్టబయలు చేసుటకు ఇక మండల ప్రజలే కంకణం కట్టినట్లు కనబడక తప్పడం లేదు. పనిచేయకుండానే లక్షల రూపాయల నిధులను దుర్వినియోగం చేశాడని ప్రజలే బయటపెట్టినప్పటికీ పంచాయతీరాజ్ నిద్రమత్తును వీడుతుందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.
*ఈ ఈ, ఎస్ ఈ లు పాత్రధారులు కాగా,ఈ ఎన్ సి కమిషన్కు కక్కుర్తి పడి నో యాక్షన్,!?*
మండలంలో కోట్ల కుంభకోణం వ్యవహారంపై నేటి వరకు పంచాయతీరాజ్ ఈ ఎన్ సి సంజీవరావు స్పందించకపోవడం వెనుక కారణమేమిటో అని యావత్ జిల్లా ప్రజలు చర్చించుకుంటున్న తరుణంలో గత వారం రోజుల క్రింద డివిజనల్ అధికారి సాయిలు పలు బినామీలు ప్రజల ప్రదేశాల్లో పలు గ్రామస్తులతో పంచాయతీరాజ్ శాఖ లో కమిషన్ మామూలే అని నాసిరకం పనులు అనేది పట్టించుకోవాల్సిన అవసరం ఉండదని ఏఈ రాజేందర్ రెడ్డి పై ఎలాంటి చర్యలు ఉండవని చెప్పుకోవడం జరుగుతుందని ప్రచురించడం కూడా జరిగింది. ఇదే క్రమంలో ఏఈ వినామీలతో చెప్పుకున్న మాటలను బట్టి చూస్తే వాస్తవానికి కుంభకోణంలో డి ఈ నుండి ఎస్సీ వరకు పాత్రధారులు అన్న విషయం ముందు నుండి అనుమానాలు వ్యక్తమౌతూ పలు సందర్భాల్లో నిజాలుగా తేలడం జరిగింది. కానీ ఉన్నత అధికారి ఈఎంసి డి ఈ ఎస్ ఈ లపై చర్యలు తీసుకుంటారని అనుకుంటున్న తరుణంలో డి ఈ సాయిలు ఏ ఈ రాజేందర్ రెడ్డి దినములకు చెప్పుకున్న మాటలు ఈ ఎన్ సి కూడా కుంభకోణానికి సంబంధించి కమిషన్ మాయలో పడి ఉన్నారని అర్థమవుతుంది. నేటి వరకు పదుల సంఖ్యలో సాక్షాలు స్థిరపైకి వచ్చినప్పటికీ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ముఖ్య అధికారి అయి ఉన్న ఈ ఎన్ సి నేటి వరకు రాజేందర్ రెడ్డి తో పాటు ఎస్సీ లపై చర్యలకు ఆదేశిస్తూ మండలంలో విజిలెన్స్ విచారణ జరిపించకుండా తనకు సంబంధం లేని అధికారులుగా భావిస్తూ కోట్ల కుంభకోణ వ్యవహారంలో ఈ ఎన్ సి సంజీవరావు నిశ్శబ్దం
కమిషన్ కక్కుర్తి లో పడి నో యాక్షన్ అన్నట్లుగా ఉందని మండలంతో పాటు జిల్లా ప్రజలంతా చెప్పుకోక తప్పడం లేదు.
*మహాదేవపూర్ కుంభకోణంపై బాధ్యత వహించేది ఎవరు,!?*
మండలంలో భారీ కోట్ల నిధుల కుంభకోణానికి శ్రీకారం చుట్టి నేడు సెలవు పేరుతో సెలబ్రేట్ చేసుకుంటూ కుంభకోణ వ్యవహార విషయంలో వరుస కథనాలు వస్తు యావత్ రాష్ట్రమంతా ఏ ఈ రాజేందర్ రెడ్డి సెలబ్రిటీగా మారిపోవడం జరిగిందని పంచాయతీరాజ్ శాఖ అనుకుంటుంది అందుకే మా అవినీతి తిమింగళం సెలబ్రిటీ తో పాటు మాకు కమిషన్ అందించే కింగ్ అని పంచాయతీరాజ్ శాఖ అనుకుంటుందేమో అందుకే నిధుల కుంభకోన వ్యవహారానికి బాధ్యత ఏ అధికారి తీసుకొని శాఖ పరుగును నిలబెట్టి నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఈ ఎన్ సి వరకు నిశ్శబ్ద వైఖరిని యావత్ ప్రజలంతా అసహ్యించుకుంటున్న క్రమంలో కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ తన బాధ్యతగా మండలంలో నిధుల దుర్వినియోగంపై విచారణకు ఆదేశిస్తారా లేక పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తాన్య రాజేందర్ రెడ్డి తోపాటు ఇతర ఉన్నత అధికారులపై కొరడా కురిపించి శాఖ పరుగులు నిలబెడతారా అనేది వేచి చూడాల్సిందే.
*అవినీతి లో కూడుకపోయి ఉన్న పనులను సాక్షాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్న ఇన్చార్జి ఏ ఈ పై చర్యలు తీసుకొని ఇతర ఏ ఈయనకి బాధ్యతలు అప్పగించాలి.*
తాజాగా మండలంలో కుంభకోణానికి శ్రీకారం చుట్టిన అభివృద్ధి పనులకు విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తే సాక్షాలు ఉండకుండా చేసే ప్రయత్నం ఏ ఈ రాజేందర్ రెడ్డి డి ఈ సాయిలు మూడు నెలలుగా ఆగి ఉండి శిథిలావస్థకు చేరి ఉన్న పనులను తిరిగి ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇంచార్జ్ ఏ ఈ రవీందర్ తో పరులను గొట్టుశప్పుడు కాకుండా ప్రారంభించడం జరుగుతుంది. తాజాగా మండల కేంద్రంలోని 24 లక్షల రూపాయలతో టెండర్ ఫార్మింగ్ కు పోవాల్సిన రహదారి బిట్లుగా ఏర్పాటు చేసి బినామీ కాంట్రాక్టర్కు అందించడం జరిగింది. నాసిరకం పనులతో బిట్ల చేసి పనులు ప్రారంభించడం జరుగుతుందని ప్రచురించడంతో కుంభకోణం లో చేపట్టిన పనులు ఆగిపోవడం జరిగింది. తిరిగి ఆ పనులను ఉన్నత అధికారులు ఎవరూ కూడా ఏఈని ఏమి చేయలేరని ముందు గాని డి ఈ ప్రచారం చేసుకోవడం తాజాగా ఏఈ తనకు ఏమీ కాదు ఉన్నతాధికారులు కూడా నా గుప్పిట్లో ఉన్నారని బినామీలకు చెప్పుకోవడం ఇన్చార్జి ఏఈగా ఉన్న రవీందర్ ను తన విధి నిర్వహణలో భాగంగా అని చెప్పుకుంటూ ఇటు స్థానిక ప్రజాప్రతినిధుల అండలతో రహదారి నిర్మాణాలను గుట్టు చప్పుడు కాకుండా నాసిరకం అయినప్పటికీ పనులు వేగం పెంచి పనులు కొనసాగించడం జరుగుతుంది. తక్షణమే ఉన్నత అధికారులు మండలంలో అవినీతికి నిధుల దుర్వినియోగానికి పాల్పడిన పనులను విజిలెన్స్ విచారణ జరిగేంతవరకు నిలిపివేయాలని ఇంచార్జ్ ఏ ఈ రవీందర్ పై చర్యలు తీసుకోవాలని రవీందర్ స్థానంలో మరి ఇతర ఏఈ ని నియమించాలని అప్పుడే మండలంలో అభివృద్ధి పనులు నాణ్యతతో సజావుగా సాగుతాయని మండలంతో పాటు జిల్లా ప్రజలు కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ తోపాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తాన్యకు వీడుకోవడం జరుగుతుంది.